English | Telugu

చిరు హీరోనా... జోకరా?

పాలిటిక్స్ లో జోకర్ అయిపోయిన మెగాస్టార్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటా అని గత రెండు సంవత్సరాలుగా డప్పుకొడుతూనే వున్నాడు. కానీ ఇంతవరకు దాని సంగతే తేల్చలేదు. లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో చిరు150వ సినిమాపై ఆసక్తికరమైన చర్చలు నడుతున్నాయి. అవి ఏమిటంటే ..ఒకప్పుడు చిరు అంటే డాన్సులు, చిరు అంటే ఫైట్స్, చిరు అంటే కామెడీ..మరి ఇప్పుడు ఆ పరిస్థితి వుందా? మునుపటిలా చిరంజీవి డాన్సులు, ఫైట్లు చేస్తారా.? అన్నది అనుమానమే. రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడాలు వచ్చేసి వుంటాయనీ, అవి తెరపై నటన విషయంలో చాలా ప్రభావం చూపుతాయనీ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి సినిమా చేయాలో చిరంజీవికే అర్థం కాని పరిస్థితి. దాంతో ఎవరితో సినిమా చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి ? అన్నదానిపై కిందా మీదా పడ్తున్నారే తప్ప, ఫలానా సినిమా చేస్తున్నా. అని ధైర్యంగా చిరంజీవి ప్రకటించలేకపోతున్నారు. దీంతో ఆయన ఇమేజ్ పై ఆయనకే అనుమానాలు ఏర్పడయన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు విన్న మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం.. ఇంద్ర సినిమాలోని డైలాగులను గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లోకి పోయాడు.. ఫ్లాప్ అయ్యాడు అనుకుంటున్నారా.. సినిమాల్లో మాత్రం అవే డాన్స్, ఫైట్స్త తో మళ్ళీ మెగాస్టార్ ని గుర్తుచేస్తాడని అంటున్నారు.

మరి మెగా ఫ్యాన్స్ అంటున్న విషయాన్ని చిరంజీవి సీరియస్ గా తీసుకుంటారా..? మళ్ళీ తన ఫైట్స్, డ్యాన్స్ లతో ఒకప్పటి జోష్ ని గుర్తుకు తెస్తారా..? లేక ఆయన డ్యాన్సులు, ఫైట్లు చూసి ఫ్యాన్స్ ఇబ్బంది పడేలా చేస్తాడా.. అన్నది చిరంజీవికే తెలియాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.