English | Telugu

వెండితెరపై రజినీ జీవితం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఒక మాములు బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించి ఇపుడు కొన్ని వేల కోట్ల జనాల అభిమానాన్ని సంపాదించుకున్న రజినీ పాత్రలో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ నటించనున్నాడు. ఈ చిత్రానికి "మై హూ రజినీకాంత్" అనే టైటిల్ పెట్టారు. వర్ష ప్రొడక్షన్స్ పతాకంపై సరోజ నిర్మించనున్న ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించనున్నాడు. కవితా రాధేశ్యాం, ఆర్యేమాన్ రామ్ సే ఇందులో ముఖ్య పాత్రధారులు. ప్రముఖ పాకిస్తానీ సంగీత దర్శకుడు తౌసిఫ్ అలీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు. ఏప్రిల్ 31న సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని రజినీకాంత్ కి అంకితం ఇవ్వాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.