English | Telugu

పక్షికి సోనాక్షి గొంతు అరువు

గతంలో హనుమంతుడి పాత్రకు నటుడు చిరంజీవి తన గొంతును అందించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా సోనాక్షి సిన్హా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. "రియో2" అనే యానిమేషన్ చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. ఇందులో జ్యూవెల్ అనే పక్షి పాత్రకు సోనాక్షి గాత్రాన్ని అందించింది. అంతే కాకుండా ఆ పాత్రకోసం ఓ పాట కూడా పాడింది. ఈ విషయంపై సోనాక్షి స్పందిస్తూ... ముందుగా మాటలు మాత్రమే చెప్తే సరిపోతుంది అని అనుకున్నా. కానీ మా చిత్రబృందం ఓ సన్నివేశం కోసం పాట పాడమన్నారు. భయం భయంగానే పాడాను. కానీ, అది అందరికీ నచ్చేసింది. నాతో పాడించినందుకు అందరికీ ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలోని బ్లూ అనే పాత్రకు అమీర్ ఖాన్ గాత్రాన్ని అందించారు. ఇది గతంలో వచ్చిన "రియో" చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.