English | Telugu

బ్యూటీక్వీన్ టు బాక్సింగ్ ఛాంప్- ప్రియాంక బర్త్ డే స్పెషల్

బ్యూటీక్వీన్ టు బాక్సింగ్ ఛాంప్- ప్రియాంక బర్త్ డే స్పెషల్


అందం, ప్రతిభ, అంతే అరుదైన వ్యక్తిత్వం ఆమె సొంతం..
మాజీ ప్రపంచ సుందరి,
బాలీవుడ్ అగ్రతార,
సింగర్, మల్టీ టాలెంటెడ్,

ఇంటెలిజెంట్ ప్రియాంక చోప్రా పుట్టిన రోజు జూలై 18...
దశాబ్ద కాలంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకుంటూ ఎంతో మంది అభిమానం చూరగొన్న ప్రియాంక తెలుగులో రామ్ చరణ సరసన తుఫాను చిత్రంలో నటించింది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...

  • 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.
  • బాలీవుడ్‌ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక మొదటిసారి నటించింది తమిళ చిత్రంలో. 2002 లో విజయ్ తో కలిసి "తమిళన్" అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాతే ఆమె హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

  • ఒకే చిత్రంలో 12 పాత్రలు చేసిన అరుదైన రికార్డు కూడా ఆమె సొంతం. వాట్స్ యువర్ రాశీ చిత్రంలో ప్రియాంక డజన్ పాత్రల్లో కనిపించింది.

  • ప్రతినాయక పాత్రలతో సహా ఎన్నో వైవిధ్యభరిత పాత్రలలో నటించింది ప్రియాంక. బర్ఫీ చిత్రంలో ఆమె కనబరిచిన నటన విమర్శకులను కూడా మెప్పించింది. ఏత్‌రాజ్, ఫ్యాషన్, 7 ఖూన్ మాఫ్, బర్ఫీ వంటి చిత్రాలలో నటనకు గాను ఆమె ఎన్నో అవార్డులు అందుకుంది. ఫ్యాషన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని సంపాదించుకుంది.

  • ఇండస్ట్రీలో పిగ్గీ, పీసీ అనీ, ఇంట్లో వాళ్లు మిమీ, సన్ షైన్ అని ప్రియాంకను ముద్దుగా పిలుస్తుంటారు.

  • డాన్, ద్రోణా వంటి చిత్రాల కోసం ఆమె కరాటే, గట్కా వంటి యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకుంది.

  • ప్రస్తుతం మేరీకోం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్ మేరీకోం చిత్రంలో ప్రియాంక టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈ మధ్యే విడుదలయింది.


పర్సనల్ లైఫ్
అశోక్ చోప్రా, మధు అఖౌరిల ముద్దుల సంతానం ప్రియాంక.
తల్లి మలయాళీ, తండ్రి పంజాబీ.. వృత్తి పరంగా వైద్యులు. ప్రియాంక తండ్రి గారాలపట్టి.
ఆమె తమ్ముడు పేరు సిద్ధార్థ్. కజిన్ పరిణిత చోప్రా కూడా బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్.
షాహిద్ కపూర్, హర్మన్ బవేజాతో ఆమె ప్రేమ వ్యవహారం నడిపింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.