English | Telugu

ఆయన పొగిడారు చాలు.. అది నాకు ఆస్కార్ కంటే ఎక్కువ!

నటుడు భానుచందర్.. నిరీక్షణ, ముక్కుపుడక, కొంటె కోడలు సినిమాల్లో హీరోగా నటించి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే నిరీక్షణ సినిమా భానుచందర్ లైఫ్ లో తనకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అని తెలుగువన్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భానుచందర్ లైఫ్ లో సినిమాల ప్రభావం ఎలా ఉంది, తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందని అన్నింటిని ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసారు.

మా నాన్న సంగీత దర్శకుడు. ఆయనకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దాంతో నేను నటుడిని కావాలని మా అమ్మ కలలు కనేది. అలాగే ఒకరోజు మేం అపార్ట్మెంట్ లో రెంట్ కి ఉండేవాళ్ళం. మాది మూడవ ఫ్లోర్.. రెండవ ఫ్లోర్ లో ఒక ఫంక్షన్ జరిగితే దానికి ఎన్టీఆర్ గారు వచ్చారు. మా బిల్డింగ్ ముందు వరుసగా ఇరవై కార్లు వచ్చి ఆగాయి. అందులో నుండి ఎన్టీఆర్ గారు అతని కింద పని చేసే వాళ్ళు మిత్రులు అందరూ వచ్చారు. అయితే ఆయన వెళ్ళిపోయేప్పుడు.. మా అమ్మ పిలిచి.. మా ఇంటికి వస్తే బాగుంటుందని అనగా.‌. ఆయన ఉండమ్మా వస్తానని చెప్పి ఒక పావుగంట మాతో మాట్లాడారు. ఇల్లంతా చూసి.. నన్ను ఏం చేస్తున్నావని అడిగారు.. నేను మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని చెప్పాను. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయారు. కొన్ని రోజులకి ఒక సినిమాలో ఫైట్ సీన్ వస్తే నన్ను పిలిపించి ఆ సీన్ ని చేపించారు. ఎన్టీఆర్ గారు దేవుడు.. ఆ స్థాయిలో ఉండే వ్యక్తితో కలసి నటించడం నాకు తృప్తినిచ్చిందని భానుచందర్ చెప్పారు.

మీకు కెరీర్ పరంగా బెస్ట్ మూవీ ఏంటని ప్రశ్నించగా.. తెలుగులో 'నిరీక్షణ', తమిళంలో‌ బాలు మహేంద్ర గారితో చేసిన 'వీడు'.. నా సినీ జీవితంలో ఈ రెండు సినిమాలు ఒక అచీవ్ మెంట్ అని భానుచందర్ చెప్పారు. బాలు మహేంద్ర గారితో సినిమా అంటే ఒక డ్రీమ్.. అలాంటిది ఆయనతో కలిసి పనిచేశాను చాలు. నిరీక్షణ మూవీ గురించి చెప్పండని ప్రశ్నించగా.. బెంగుళూరులో ఒక జైలులో షూటింగ్.. పోలీస్ ఆఫీసర్ వచ్చి ఖైదీలను వరుసగా నిలబెట్టి ఇప్పండ్రా బట్టలు అంటే అందరూ వొంటి మీద డ్రాయర్ కూడా లేకుండా నిలబడతారు. అయితే బాలు మహేంద్ర గారు మలయాళంలో మమ్ముట్టితో చేస్తున్నప్పుడు ఆయన డ్రాయర్ తీయనన్నాడు అలాగే చేసాం మరి నువ్వేంటి అని నన్ను ఆయన అడిగారు. అప్పుడు నేను ఒకటే అన్నాను.. ఇక్కడ భానుచందర్ గా లేను ఒక క్యారెక్టర్ గా నిల్చున్నాను. మీకు డ్రాయర్ విప్పి నిల్చోవాలా అలాగే నిల్చుంటానని చెప్పి నిల్చున్నాను. ఆ తర్వాత సీన్ లో నాకు‌ గుండు కొడతారు. అదంతా కెమెరాలో చూస్తున్నారు. ఆ సీన్ అయిపోయింది.‌ కెమెరా రోల్ అవుతుంది. బాలు మహేంద్ర గారు అలా పక్కకి వెళ్ళి కన్నీళ్ళు తుడుచుకుంటున్నారు. ఆయన దగ్గరకి నేను వెళ్ళి.. ఏంటి సర్ సీన్ బాగా రాలేదా? మళ్ళీ చేద్దామా? అని అడిగేసరికి.. అది కాదు.. సినిమా కోసం ఇంత కష్టపడుతున్నావ్. ఇలాంటి ఆర్టిస్ట్ లు మన ఇండస్ట్రీకి కావాలని చెప్పారు. అలాంటి వ్యక్తి పొగిడాడంటే అది చాలు నా లైఫ్ కి.. ఆస్కార్ కంటే కూడా ఎక్కువ అని భానుచందర్ చెప్పాడు. సింహాద్రి సినిమాలో మంచి రోల్ లో చేసిన భానుచందర్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.