English | Telugu

'ఆదిపురుష్' కొత్త టీజర్ కి ముహూర్తం ఖరారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న 'ఆదిపురుష్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గతేడాది అక్టోబర్ లో విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ ఫెయిల్ అయింది. వీఎఫ్ఎక్స్ బడ్జెట్ కి తగ్గట్లుగా లేవని.. రావణుడి, హనుమంతుడి వేషధారణ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవనే విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫ్ఎక్స్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించిన మూవీ టీమ్.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రాన్ని జూన్ కి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే అదిరిపోయే సర్ ప్రైజ్ కూడా రానుందని తెలుస్తోంది.

శ్రీరామ నవమి కానుకగా మార్చి 30న 'ఆదిపురుష్' కొత్త టీజర్ ను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందట. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకుండా ఉండేలా టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట. బడ్జెట్ కి, సబ్జెక్టు కి తగ్గట్లుగా వీఎఫ్ఎక్స్, పాత్రల వేషధారణ పర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తున్నారట. అదే జరిగితే మాత్రం మొదటి టీజర్ విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. రెండో టీజర్ తర్వాత ఆ స్థాయికి వెళ్తాయి అనడంలో సందేహం లేదు.

టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకుడు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నాను. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023, జూన్ 16న విడుదల చేయనున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.