English | Telugu

ల‌య‌న్ డైలాగులు లీక్‌

ఈమ‌ధ్య లీకేజీల గోల ఎక్కువైంది. పాట‌లు, స‌న్నివేశాలు... ఏకంగా సినిమానే రిలీజ్‌కు ముందు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంది. తాజాగా ల‌య‌న్ సినిమాలోని డైలాగులు లీక‌య్యాయి. అయితే వీటిని లీక్ చేసిందెవ‌రో కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ‌. అనంత‌ర పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బాల‌య్య‌.. అక్క‌డ అభిమానుల కోరిక మేర‌కు ల‌య‌న్‌లోని రెండు డైలాగులు వ‌దిలారు.. అవి ఇవే.. నాకు పుట్టుకతోనే భగవంతుడు ప్రతీ పార్ట్ లో ఓ పవర్ దాచాడు. పొరపాటున ఒక్క పార్ట్ టచ్ చేసినా.. ఇక అంతే.. అవుట్ ! 'నన్ను పడుకోబెట్టాలంటే.. ఎప్పుడో పడుకున్న నీ తాతలు తిరిగొచ్చినా ఏం పీకలేర్రా'.. వామ్మో.. డైలాగులు అదిరిపోలేదూ..! పార్టుల్లో ప‌వ‌రేమో గానీ, బాల‌య్య మాట‌ల్లో మాత్రం కావ‌ల్సినంత ఉంది. థియేట‌ర్లో ఈ డైలాగులు ఎలా పేల‌తాయో గానీ, ఈ సినిమా బ‌య‌టకు వ‌చ్చేలోగా ఈ డైలాగుల‌పై బోలెడ‌న్ని పేర‌డీలు పుట్టేయ‌డం ఖాయం.