English | Telugu
ఆగస్టు 9న రానున్న పవన్ కళ్యాణ్
Updated : Aug 3, 2013
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "అత్తారింటికి దారేది". ఈ చిత్రాన్ని ఆగష్టు 7వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. రెండు రోజులు వాయిదా వేసి ఈ చిత్రాన్ని ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు. సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.