English | Telugu

రుద్రమదేవిలో గణపతిదేవుడు ఆయనే

ఓరుగల్లు రాణి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ నిర్మిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దగ్గుపాటి రానా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇక గోనగన్నా రెడ్డి పాత్రకు అల్లు అర్జున్ ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడూ తాజాగా రుద్రమదేవి తండ్రి గణపతి దేవుని పాత్రలో కృష్ణంరాజు నటించ బోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్యాథరిన్, నిత్యామీనన్, బాబా సెహగల్ కూడా నటిస్తున్నారు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.