English | Telugu

మహేష్ తో కాకుండా నానితో చేసుంటే ఆ మూవీ హిట్ అయ్యేది

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)కాంబోలో 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '1 నేనొక్కడినే'(1 Nenokkadine). సైకలాజికల్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ మూవీని '14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్' అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. మహేష్ ఈ మూవీలో 'ఇంటిగ్రేషన్ డిజార్దర్' తో బాధపడే వ్యక్తిగా నటించాడు. అంటే మెదడుకి అన్ని విషయాల్ని గుర్తు పెట్టుకునే సామర్ధ్యం ఉండదు. అటువంటి ఇబ్బంది పడే క్యారక్టర్ లో మహేష్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు, ఎప్పుడు ఏం జరుగుతుందనే విధంగా కథనాలు సాగుతాయి. కాకపోతే పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

రీసెంట్ గా ని 14 రీల్స్ అధినేతలో ఒకరైన 'అనిల్ సుంకర'(Anil Sunkara)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు భారీ స్టార్ డమ్ కలిగి ఉన్న 'మహేష్' ని అభిమానులు,ప్రేక్షకులు 'ఇంటిగ్రేషన్ డిజార్దర్ వ్యక్తిగా విజువల్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ కట్ చూడగానే, ఎక్కడో తేడా కొడుతుందని అనుకున్నాను. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. మహేష్ తో కాకుండా నాని లాంటి హీరోతో చేసుండాల్సింది. సబ్జెట్ ప్రకారం హీరోకి ఇమేజ్ ఉండకూడదు. నాని హీరోగా అప్పుడప్పుడే నోటెడ్ అవుతున్నాడు. అందుకే నాని తో చేసుంటే సినిమా హిట్ అయ్యేది. ప్రొడ్యూసర్ గా కాకుండా సూపర్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్ గా ఈ విషయాన్నీ చెప్తున్నానని తెలిపాడు.

అప్పట్లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో '1 నేనొక్కడినే' భారతీయ సినిమా చరిత్రలో అత్యధికపాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్ లో నిర్వహించిన సర్వేలో సైతం, ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది, మహేష్ తో 'అనిల్ సుంకర దూకుడు, ఆగడు సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు కూడా నిర్మించాడు. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ అనే మరో బ్యానర్ నిర్మాణంలో మహాసముద్రం, భోళా శంకర్, మజాకా వంటి పలు విభిన్నమైన చిత్రాలు నిర్మించాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం