English | Telugu

ఏం బ‌తుకులురా మీవి.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు!

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత మూడు చిత్రాలు 'ది వారియర్', 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' నిరాశపరచడంతో.. 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో సాలిడ్ కామ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. (Andhra King Taluka Teaser)

ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ సూర్య అనే స్టార్ హీరో పాత్రలో ఉపేంద్ర కనిపిస్తుండగా, అతని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రామ్ కనిపిస్తున్నాడు. ఓ వైపు ఉపేంద్రపై అభిమానం, మరోవైపు భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమను చూపిస్తూ టీజర్ ను ఆసక్తికరంగా రూపొందించారు. రామ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా కనిపించాడు. "ఈడ్ని నైజాంలో కోసి, గుంటూరులో కారం పెట్టి, సీడెడ్ లో ఫ్రై చేసి, ఆంధ్రాలో పలావ్ వండేస్తే.. మొత్తం దిగిపోద్ది" వంటి డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఉండే సినిమా పిచ్చిని తెలిపేలా ఉన్నాయి. ఇక "ఫ్యాన్ ఫ్యాన్ అని నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులురా మీవి.. ఛీ ఛీ" అనే డైలాగ్ తో టీజర్ ని ఎండ్ చేయడం ఆకట్టుకుంది.

ఒక ఫ్యాన్ బయోపిక్ గా రూపొందుతోన్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ టీజర్ చూస్తుంటే.. అందరి హీరోల ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి, రామ్ ఎదురుచూస్తున్న సక్సెస్ ని ఇస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.