English | Telugu
అనసూయ సంచలన నిర్ణయం.. నెక్స్ట్ ఏం జరగబోతుంది!
Updated : Jan 14, 2026
-రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అనసూయ
-పోలీస్ కేసు నమోదు చేసిన సైబరాబాద్ క్రైమ్ డిపార్ట్మెంట్
-నమోదయిన కేసులో ఎవరు ఉన్నారు
-నెక్స్ట్ ఏం జరగబోతుంది!
రెండు తెలుగు రాష్టాల సిల్వర్ స్క్రీన్ , బుల్లితెర ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు అనసూయ(Anasuya).అంతలా సుదీర్ఘ కాలం నుంచి ఆ రెండు రంగాల్లో తన సత్తా చాటుతూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని ఏర్పరచుకుంది. పలు సామాజిక సమస్యలపై కూడా ఎలాంటి బెరుకు లేకుండా స్పందించడం అనసూయ స్పెషాలిటీ. రీసెంట్ గా అనసూయకి సంబంధించిన న్యూస్ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో హీట్ ని పెంచుతుంది. సదరు న్యూస్ వివరాలేంటో చూద్దాం.
తనపై ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న లైంగిక, మానసిక వేధింపులపై సైబర్‌క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో' నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత, కొందరు వ్యక్తులు తనపై ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్ చేసిన, AI సృష్టించిన లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ని ప్రచారం చేసి తన పరువుకి నష్టం కలిగించేలా ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొంది,. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె పేర్కొన్న వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 75 (లైంగిక వేధింపులు), 79 (మహిళల మర్యాదకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చేసిన చర్య), 336(4), 351, 356 మరియు IT చట్టంలోని సెక్షన్లు 66-E, 67 కింద మొత్తం 73 మందిపై కేసు నమోదు చేశారు.
Also read: తెలుగు సినిమాని ఎవర్రా చంపేది.. అంత దమ్ముందా మీకు!
అనసూయ ఫిర్యాదు చేసిన వాళ్ళల్లో రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ బొజ్జ సంధ్య రెడ్డి, కామెంటేటర్లు ప్రియా, గోగినేని, విజయలక్ష్మి , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ పావని, ఆర్టిస్ట్ శేఖర్ బాషాతో పాటు టెలివిజన్ యాంకర్లు పలు మీడియా చానెల్స్ ఉన్నాయి. దీంతో ఈ కేసు ఎటు వైపు వెళ్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. వేధింపుల కారణంగా తన భద్రతకు ముప్పు ఉందని, భయం వెంటాడుతోందని కూడా అనసూయ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.