English | Telugu

బన్నీ త్యాగం చేశాడా??

అటు రేయ్ - ఇటు స‌న్నాఫ్ కృష్ణ‌మూర్తి.. వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండు మెగా సినిమాలొస్తున్నాయంటే మెగా అభిమానుల‌కు పండ‌గే. అయితే.. స‌న్నాఫ్ స‌త్యమూర్తి కాస్త వైవిఎస్ చౌద‌రి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈనెల 27న రేయ్ వ‌స్తుంది. ఏప్రిల్ 2...బ‌న్నీ సినిమాకి ముహూర్తం ఫిక్స‌య్యింది. నిజంగా ముందు అనుకొన్న‌ట్టు బ‌న్నీ సినిమా వ‌స్తే రేయ్‌కి దెబ్బ‌డిపోతుంది. ఈ విష‌య‌మై వైవిఎస్ చౌద‌రి బ‌న్నీని సంప్ర‌దించాడ‌ట‌. ``మీ సినిమా మ‌రో వారం రోజులు ఆగితే.. రేయ్ గ‌ట్టెక్కుతుంది.. ప్లీజ్‌`` అంటూ అభ్య‌ర్థించాడ‌ట‌. దాంతో బ‌న్నీ కాస్త సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ని ఏప్రిల్ 8 వ తేదీన తీసుకురావ‌డానికి ఒప్పుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఆరోజు బ‌న్నీ పుట్టిన రోజు కూడా. అందుకే సెంటిమెంట్ ప‌రంగా త‌న‌కూ క‌లిసివ‌స్తుంద‌ని బ‌న్నీ న‌మ్ముతున్నాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వాయిదాప‌డ‌డం నిజ‌మైతే.. వైవిఎస్ చౌద‌రి `రేయ్‌`తో పండ‌గ చేసుకోవ‌డం ఖాయం. మొత్తానికి రేయ్ కోసం... బ‌న్నీ త‌న సినిమాని త్యాగం చేసిన‌ట్టే లెక్క‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.