English | Telugu

హనీమూన్ తో ఆ కోరిక తీరింది - అమలాపాల్

అలా పరిశ్రమకు వచ్చి, ఇలా చక్కటి అవకాశాలు దక్కించుకొని తెరపై తళుక్కున మెరిసి తర్వాత టపీమని మాయమైంది అమలాపాల్ . ఈ నెల 12 నే దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. పెళ్లి ఎప్పుడెప్పుడా అని కలవరించిన అమలాపాల్ తన వివాహానికి సంబంధించిన ప్రతివిషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తోంది. వివాహ అనంతరం హనీమూన్ ఫోటోలు కూడా షేర్ చేసుకుంది. అవి చూసి కొంతమంది వెగటు కామెంట్లు పెట్టే సరికి ఆ ఫోటోలు వెనక్కు తీసుకుంది.

పెళ్లైన తర్వాత అమ్మాయిలు చాలా మారిపోతారు. ఈ విషయం వాళ్లకు తెలియకుండానే జరిగిపోతుంది. అదే విషయం అమలాపాల్ కూడా చెప్తోంది. పెళ్లి మహిళను పూర్తిగా మార్చేసుంది, స్త్రీ తన లోని సామర్థ్యాలను కనిపెట్టుకోగలుదు అంటూ చాలా విషయాలు గడగడా చెప్తోంది. ఇంతకీ ఇంత జ్ఞానం ఆమెకు కలగడానికి వెనుక వున్న సంఘటన గురించి చెప్పాలి. స్కూబా డైవింగ్ అంటే తనకు ఎప్పటి నుంచో ఇష్టమట. అయినా ఇప్పటి వరకూ ట్రై చేయని అమలా భర్త సహకారంతో ఆ పని చేసిందట. అలా జీవితంలో తీరదనుకున్న ఆ కోరిక పెళ్లయ్యాక హనీమూన్ లో తీరిందట. అదండి ఈ జ్ఞానం వెనుక వున్న కథ.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.