English | Telugu

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మొదలెట్టారు

చాలా కాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఓ శుభవార్త. హైదరబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్ పై ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రోమాన్స్ చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిగా సమంత, అదా శర్మలను ఫైనలైజ్ చేయగా, మరో హీరోయిన్ ఎంపిక కావల్సివుంది. జులాయి, అత్తారింటికి దారేదీ బ్లాక్ బాస్టర్ల తరువాత మాటల మాంత్రికుడు డైరెక్టర్ 'త్రివిక్రమ్', 'రేసుగుర్రం' సూపర్ హిట్ తరువాత అల్లుఅర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.