English | Telugu

అసలు మనసెలా ఒప్పిందంటూ ఫైర్‌ అవుతున్న ఆలియా!

దేనికైనా హద్దుంటుంది.. ఉంటుందా? ఉండదా? కొన్ని పనులు చేయడానికి ముందు ఆలోచించాలి. ఆలోచించాలా? వద్దా? అంటూ ఫైర్‌ అవుతున్నారు ఆలియా. ఆమె అలా అవడంలోనూ తప్పు లేదంటూ ఆమెకు సపోర్ట్ నిలుచుంటున్నారు సెలబ్రిటీలు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కనిపించే ఆలియాకు అసలు కోపం ఎందుకు వచ్చింది? అనేది ఇంపార్టెంట్‌ టాపిక్‌. ఆలియా మధ్యాహ్నం తన ఇంట్లో కూర్చుని ఉన్నారట. తనపై ఎవరో ఫోకస్‌ చేస్తున్నట్టు అనుమానం వచ్చిందట. తదేకంగా తననే చూస్తున్నట్టున్న వైపు చూస్తే ఇద్దరు వ్యక్తులు కెమెరాలతో తనను ఫోకస్‌ చేస్తున్న విషయం తెలిసిందట. వెంటనే వారిని పట్టుకున్నారు ఆలియా. ఆ వార్తలను పబ్లిష్‌ చేస్తున్న సంస్థ మీద ఫైర్‌ అయ్యారు. 'అసలు ఇలాంటివి ఎందుకు చేస్తారు? ఇంట్లో కూడా ప్రైవసీ లేకుంటే ఎలా? నా ప్రమేయం లేకుండా నన్ను ఫొటోలు తీయడం భావ్యమేనా' అంటూ ప్రశ్నించారు. దాంతో పాటు పోలీసులను కూడా ట్యాగ్‌ చేశారు ఆలియా.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ ఈ టాపిక్‌ గురించి ఆమెకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. తనయుడు జే విషయంలోనూ గతంలో కరీనాకపూర్‌ చాలా మంది పత్రికల వారికి ఇలాంటి రిక్వస్టులే పెట్టారు. ఆలియా పోస్ట్‌ని షేర్‌ చేస్తూ జాన్వీ కూడా ఇంట్రస్టింగ్‌ విషయాలను జతచేశారు. ''నాకు తెలియకుండా నా జిమ్‌ ఫొటోలను షేర్‌ చేశారు. నాలుగు గోడల లోపు మన పర్మిషన్‌ లేకుండా ఎందుకు ఫొటోలు తీస్తారో అర్థం కాదు. జూమ్‌ లెన్స్ వాడి ఇలా ఫొటోలుతీయడం సరికాదు'' అని అన్నారు. అనుష్క శర్మ, కరణ్‌ జోహార్‌, అర్జున్‌ కపూర్‌, షహీన్‌ భట్‌ కూడా ఆలియాకు మద్దతుగా మాట్లాడారు. అసలు ఇలాంటి చర్యలకు ఎవరు అనుమతి ఇచ్చారంటున్న ఆలియా ఆవేశం సబబైనదే అని అంటున్నారు. ఇవన్నీ సిగ్గుచేటు చర్యలని అన్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.