English | Telugu

శ్రీలీలతో అఖిల్ లవ్ స్టోరీ.. రంగంలోకి నాగార్జున..!

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. (Akhil Akkineni)

'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్.. ఎట్టకేలకు కొత్త సినిమా అప్డేట్ ఇస్తున్నాడు. అఖిల్ తన ఆరవ సినిమాని 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో చేస్తున్నాడు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రేపు(ఏప్రిల్ 8) విడుదల కానుంది. ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కుతోందట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. (Lenin)

అఖిల్, శ్రీలీల ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు. అఖిల్ ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగతా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇక 'ధమాకా', 'భగవంత్ కేసరి' సినిమాలతో ఆకట్టుకున్న శ్రీలీల.. ఇటీవల వరుస పరాజయాలను చూసింది. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కోసం జత కట్టారు. మరి ఈ 'లెనిన్' వీరికి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం