English | Telugu

అఖిల్‌.. ఆల్ రౌండ‌ర్‌!

అఖిల్‌ని వెండి తెర‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తెలుగు చిత్ర‌సీమ కూడా.. ఈ సిసింద్రీఎంంట్రీపై ఓ కన్నేసింది. అఖిల్ శ‌క్తి సామర్థ్యాల‌కు తొలి సినిమా `అఖిల్‌`నే ఓ వేదిక అయిపోయింది. అఖిల్ డాన్సుల్లో, ఫైట్స్‌లో, డైలాగుల్లో ఎంత ప‌వ‌ర్ ఉందో.. అఖిల్ సినిమానే చెప్ప‌బోతోంది. అఖిల్ కెపాసిటీని.. అఖిల్‌లో ఉన్న ఆల్‌రౌండ‌ర్‌నీ వినాయ‌క్ ట్రైల‌ర్‌లోనే చూపించేశారు. ఫైట్స్‌లో అద‌ర‌గొట్టాడు, డాన్సుల్లో జోష్ చూపించాడు. డైలాగుల్లో ఆక‌ట్టుకొన్నారు. స్ర్కీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంద‌ని మ‌హేష్ బాబు కొనియాడాడు.

ఇంత‌కంటే ఓ డెబ్యూ హీరోకి ఇంకేం కావాలి..? అఖిల్ రూపంలో తెలుగు చిత్ర‌సీమ‌కు మ‌రో పెద్ద హీరో వ‌చ్చేశాడ‌ని మ‌హేష్ కితాబిచ్చాడు. ఇక నాగార్జున ఆశ‌లు, క‌లలు ఇవ‌న్నీ తీరిపోయినట్టే. ట్రైల‌ర్లో ఉన్న దూకుడు సినిమాలోనూ ఉంటే... అఖిల్ సూప‌ర్ హిట్ట‌వ్వ‌డం ఖాయం. హీరోయిజాన్ని త‌న‌దైన కోణంలో చూపించే ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు వినాయ‌క్ తోడుగా ఉన్నాడు కాబ‌ట్టి... హిట్టుపై భ‌రోసా మ‌రింత పెరిగింది. మొత్త‌మ్మీద అఖిల్ పెర్‌ఫార్మ్సెన్స్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. వాళ్ల‌కు ద‌స‌రా పండ‌గ ఆడియో ఫంక్ష‌న్‌తోనే మొద‌లైపోయింది. ఆల్ ది బెస్ట్ అఖిల్‌.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.