English | Telugu

అఖండ 2 టాక్ ఎలా ఉండబోతుంది!

-బాలయ్య సింహగర్జన స్టార్ట్
-మూవీ ఎలా ఉండబోతుంది
-అభిమానులు ఏమంటున్నారు


సమయం లేదు మిత్రమా అనే రీతిలో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అఖండ 2(Akhanda 2)తో బాలయ్య(Balakrishna)సింహగర్జన చేసుకుంటూ వస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ సింహగర్జన స్థాయి ఏ విధంగా ఉండబోతుందో తెలియయడంతో థియేటర్స్ లోని సౌండ్ బాక్సులుకి ఏం కాకుండా సరికొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా ముందు రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో అభిమానులు, మూవీ లవర్స్ ప్రీమియర్ షో టికెట్స్ కోసం తమ ప్రయత్నాల్లో ఉన్నారు.


ఇక మొదట నుంచి అఖండ 2 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఘన విజయాన్ని అందుకున్న అఖండ కి సీక్వెల్ కావడం, ఈ సారి బాలయ్య అఘోర గా పూర్తి స్థాయిలో కనిపిస్తుండటం అందుకు కారణం. హైందవ ధర్మం యొక్క గొప్ప తనం కూడా చెప్తుండటంతో పాన్ ఇండియా ప్రేక్షకులు అఖండ 2 రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అయితే అందరిలో పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అఖండ 2 హిట్ సాధించడం పక్కా. ఈ సారి కూడా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య సరికొత్త రికార్డులు సృషించబోతున్నాడు. ఆ రికార్డుల యొక్క సౌండ్ సౌత్ నుంచి నార్త్ దాకా చాలా గట్టిగానే వినపడబోతుందనే అభిపాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read:నాగచైతన్య ఏం చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా

రీసెంట్ గా అఖండ 2 సెన్సార్ ని పూర్తి చేసుకుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కలిసి కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా యు/ ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ వాళ్ళు ఇచ్చారు. ఈ విషయం కూడా మూవీకి కలిసి వచ్చే అంశం. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడం అభిమానులని సంతోషపరిచే మరో అంశం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.