నాగచైతన్య ఏం చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
on Dec 1, 2025

-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
-అప్ డేట్ ఇవ్వాలని సూచన
-నెక్స్ట్ మూవీ ఏంటి!
కింగ్ 'నాగార్జున'(Nagarjuna)నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 'నాగచైతన్య'(Naga Chaitanya)తనకంటూ సినీ వినీలాకాశంలో ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు.మూస ధోరణి లో సినిమాలు చెయ్యకుండా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చెయ్యడం నాగ చైతన్య స్పెషాలిటీ. అందుకే వారసత్వంగా వస్తున్న అక్కినేని అభిమానులే కాకుండా తనకంటూ సొంతంగా అభిమానులని సంపాదించుకున్నాడు.
ఈ ఏడాది 'తండేల్' తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకోగా, ప్రస్తుతం 'వృష కర్మ'(Vrusha Karma)అనే మూవీ చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా 'విరూపాక్ష' తో సత్తా చాటిన కార్తీక్ దండు దర్శకుడు. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'వృషకర్మ' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగానే ఉండటంతో 'వృషకర్మ' రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు ప్రస్తుత రోజుల్లో మూవీకి మేకింగ్ నుంచే పబ్లిసిటీ ఎంతో అవసరం అవుతుంది.
also read: సమంత, రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా!.. రాజ్ ఆస్థి విలువ ఎంత
ఆ విధంగా చేయడం వలన ప్రేక్షకుల నోళ్ళల్లో సినిమా రన్ అవుతూ ఉంటుంది. దాంతో రిలీజ్ రోజున కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండటంతో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి 'వృషకర్మ' అప్ డేట్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుతున్నారు.సుకుమార్(Sukumar)రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మిస్తుండగా వరుస హిట్స్ తో జోరుపై ఉన్న 'మీనాక్షి చౌదరి'(Meenakshi Chaudhary)హీరోయిన్ గా చేస్తుండం ప్రత్యేకతని సంతరించుకుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రతిభావింతమైన టెక్నీషియన్స్ వృష కర్మ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



