English | Telugu

Akhanda 2: 'అఖండ'కు రెట్టింపు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్ షోలతోనే అఖండ తాండవం మొదలుకానుంది. (Akhanda 2: Thaandavam)

అసలే బాలకృష్ణ-బోయపాటి కాంబో, దానికితోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో.. 'అఖండ 2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. బాలయ్య కెరీర్ లోనే రికార్డు బిజినెస్ చేసింది.

బాలకృష్ణ కెరీర్ లో వంద కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి సినిమా 'అఖండ 2' కావడం విశేషం. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.114.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

నైజాంలో రూ.23.50 కోట్లు, సీడెడ్ లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.42.75 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.88.25 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.11 కోట్లు, ఓవర్సీస్ లో రూ.15 కోట్లతో వరల్డ్ వైడ్ గా రూ.114.25 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.

Also Read: విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!

2021లో వచ్చిన 'అఖండ' రూ.53 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పుడు 'అఖండ 2' దానికి రెట్టింపు బిజినెస్ చేయడం విశేషం.

'అఖండ 2' బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.115 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై నెలకొన్న బజ్ ని బట్టి చూస్తే.. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.