English | Telugu

సన్నీలియోన్ కి అమీర్ ట్వీట్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ను అభిమానించని వారుండరనే చెప్పాలి. అందులో భాగంగా ఆయన తాజా చిత్రం 'దంగల్' ఫస్ట్ లుక్ చూసి చాలామంది అభిమానులు పొంగిపోతున్నారు. 'దంగల్'లో పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని పెంచి చాలా కష్ట పడ్డాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. దాంతో 'దంగల్' ఫస్ట్ లుక్ చూడగానే ఆయన అభిమానులు సినిమా రాకముందే ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందులో సన్నీ లియోన్ కూడా ఉండడం విశేషం.

గత కొంతకాలంగా ఇండియాను ఊపుతున్న సన్నీలియోన్, అమీర్ దంగల్ ఫస్ట్ లుక్ కు ఫిదా అయిపోయిందట. అంతేకాదు 'దంగల్'లో అమీర్ లుక్ తో పాటు, అతను నటించిన శ్నాప్ డీల్ యాడ్ లో మరింత మురిపించాడంటూ.. ఆ యాడ్ ను చూసి మురిసిన సన్నీ, అందులో అమీర్ ఇంకా హాట్ గా కనిపిస్తున్నాడని ట్వీట్ చేసింది.

దాంతో అమీర్ సైతం సన్నీ ట్వీట్ కి మరింత మురిసిపోయాడు. అంతటితో ఆగకుండా సన్నీకి తనదైన రీతిలో సమాధానమిచ్చాడు అమీర్. తన యాడ్ చూసి సన్నీ ట్వీట్ చేసినందుకు 'థ్యాంక్స్ 'అంటూనే, 'నువ్వు కూడా చాలా హాట్ గా ఉన్నావ్' అంటూ ట్వీట్ చేశాడు అమీర్. ఇలా సన్నీ- అమీర్ మధ్యన సాగిన ట్వీట్స్ చాలా సరదాగా సాగిపోయిందట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.