English | Telugu

హైదరాబాదులో ఏప్రిల్ 27న ఆగడు

"దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ఆగడు". ఈ చిత్ర కొత్త షెడ్యుల్ హైదరాబాదులో ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమన్నా మిఠాయి షాప్ నడిపిస్తూ ఉంటుంది. సోనూసూద్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా (మే 31) చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను త్వరలోనే విడుదల చేసి, చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.