English | Telugu

'ఆగడు' ఆడియో హంగామా

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మహేష్‌ 'ఆగడు' సినిమా ఆడియో రిలీజ్‌ ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరగబోతుంది. ఇప్పటికే మహేష్‌బాబు పంచ్‌ డైలాగులు ఆగడుపై అంతులేని అంచనాలు పెంచేసాయి. అలాగే ఈ సినిమాలోని పాటలు ఎలా వుంటాయోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'ఆగడు' తమన్‌ యాభైవ చిత్రం కావడంతో అద్దిరిపోయే ఆల్బమ్‌ అందించాడని సమాచారం. మరి ఈ పాటలు వినాలంటే కొద్ది గంటలపాటు వేచి వుండాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.