English | Telugu

మహేష్‌ ఇన్‌స్పిరేషన్‌తో తెలుగు తెరపై యువనటుడు లక్కీ

సినీపరిశ్రమ పుష్పకవిమానం లాంటిది. సంఖ్య ఎంత పెరిగినా అందులో మరొకరికి స్థానం ఉంటూనే ఉంది. అలాంటి చోట తనకూ ఓ స్థానం పొందాలనుకుంటున్నాడు యువ నటుడు లక్కీ. సినిమాల మీద ఉన్న అమితాసక్తితో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రిన్స్‌ మహేష్‌బాబు స్ఫూర్తితో నటుడిగా ఎదిగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యువకెరటం.
ఏ హీరో ఇన్‌స్పిరేషన్‌తో సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడో... ఇప్పుడు ఆ కథానాయకుడు మహేష్‌బాబు నటిస్తున్న ‘ఆగడు’ చిత్రంలో ఓ చిన్న పాత్రను సొంతం చేసుకున్నాడు లక్కీ. ‘ఆగడు’తో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటించే అవకాశం పొందిన ఈ యువనటుడు లక్కీ.. ఇకమీదట తనకు గుర్తింపు తెచ్చే పాత్రల్లో నటించడానికి రెడీగా వున్నాడు. బిటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్స్‌ని కంప్లీట్‌ చేసిన ఈ యువనటుడు లక్కీ వయస్సు 22 సంవత్సరాలు. ఎత్తు ఆరడుగులు. కేవలం సినిమాలలో నటనకే పరిమితం కాకుండా నేటి సినిమాలకి కీలకమైన సాంకేతిక అంశాలపైనా దృష్టిసారిస్తున్నాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం వి.ఎఫ్‌.ఎక్స్‌. గ్రాఫిక్స్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. నటనకు అవకాశమున్న ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్న లక్కీకి మున్ముందు మరిన్ని అవకాశాలను పొంది నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతూనే తెలుగు తెరపై హీరోగా నిలదొక్కువోవాలన్న ఆశాభవంతో ఉన్నాడు. ముఖ్యంగా తన నాన్నగారి ప్రోత్షాహంతో అడుగులతో మొదలైన సినీ ప్రయాణం పరుగుల వైపు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మెరిసే కళ్ళతో చెబుతున్న లక్కీ ఆకాంక్ష నేరవాలని ఆకాంక్షిద్దాం.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.