English | Telugu

'కల్కి 2898 AD'లో ఐదవ సూపర్‌స్టార్.. ప్రభాస్ ఫ్రెండే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కల్కి 2898 AD' నుంచి ఐదవ సూపర్‌స్టార్, భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జి ని మే 22, 2024న రివీల్ చేయనున్నారనే తాజా అనౌన్స్ మెంట్ తో అంచనాలు మరింత పెరిగాయి.

'ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్' అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎంతో క్రియేటివ్ గా ఉంది. ఐదవ సూపర్‌స్టార్ బుజ్జి గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తోంది. 2 నిమిషాల 22 సెకన్ల వీడియోలో.. గ్యారేజ్ లో భైరవగా ప్రభాస్ కనిపించడం, బుజ్జితో మాట్లాడటం ఆకట్టుకుంది.

ఇటీవల కల్కి 2898 AD నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులని మంత్రుముగ్దులని చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.