Read more!

English | Telugu

నెల రోజులకే ఓటీటీలోకి మలయాళ ఇండస్ట్రీ హిట్ '2018'

2018లో సంభవించిన కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మలయాళ చిత్రం '2018'. టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. మలయాళ వెర్షన్ మే 5 న విడుదల కాగా, ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు వెర్షన్ మే 26 న విడుదల కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే మలయాళ సినీ చరిత్రలో 150 కోట్ల గ్రాస్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచిన '2018', నెల రోజులకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

'2018' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 7 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తాజాగా సోనీ లివ్ ప్రకటించింది. ఓ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ని ఇంత త్వరగా స్ట్రీమింగ్ చేయనుండటం షాకింగ్ గా మారింది. మరోవైపు కేవలం మలయాళ వెర్షన్ స్ట్రీమింగ్ అవనుందా? లేక ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్ట్రీమింగ్ నాటికి మలయాళ వెర్షన్ విడుదలై నెల రోజులు అవుతుంది కానీ, తెలుగు వెర్షన్ థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు కూడా కాదు. మరి ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడానికి ఇంకా టైం పడుతుందో లేక జూన్ 7 నే అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చి సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.