English | Telugu
180 మూవీ రివ్యూ
Updated : Jun 24, 2011
ఒక పిల్లాడు వారణాశిలో తన తండ్రికి పిండ ప్రదానం చేసి వెంటనే తన బొమ్మ కారుతో ఆడుకుంటుంటాడు. ఆ పిల్లాడే సిద్ధార్థకి స్ఫూర్తిగా నిలుస్తాడు. తన అసలు పేరు ఎజె (అజయ్ కుమార్)ని మార్చేసి ఆ పిల్లాడి పేరు మనూ అన్న పేరుతో చెన్నైకి వెళ్లి హ్యాపీగా బ్రతుకుతూంటాడు. అక్కడ అతనికి ఒక ఫొటో జర్నలిస్ట్ విద్య(నిత్య మీనన్) పరిచయమవుతుంది. ఆమె అతన్ని ప్రేమిస్తున్నానంటుంది. ఆ సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అవటంతో ఆమెను అమెరికా తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెను కాపాడటానికి అతను అమెరికా తీసుకెళతాడు.
ఫ్లాష్ బ్యాక్ లో సిద్ధార్థ అమెరికాలో ఒక డాక్టర్. అతనికి ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఇంటీరియర్ డిజైనర్, ప్రియాతి ప్రియమైన భార్య (ప్రియా ఆనంద్) ఉంటుంది. చాలా హ్యాపీగా సాగుతున్న జీవితంలో మూడు నెలలు గడిచేసరికి క్యాన్సర్ కారణంగా సిద్ధార్థ ఆరు నెలల (180 రోజులు) కన్నా ఎక్కువ రోజులు బ్రతకడని తెలుస్తుంది. దాంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అమెరికాలో భార్య ప్రియా ఆనంద్ కి కలరిచ్చి చెన్నైకి వచ్చి హ్యాపీగా బ్రతికేస్తుంటాడు. నిత్య మీనన్ కోసం అమెరికా తిరిగి వచ్చిన సిద్ధార్థ ఏం చేశాడు....? తన భార్యని కలిశాడా...? అన్నది మిగిలిన కథ.