English | Telugu

బ్లూ రే డివిడి లో "100%లవ్" సినిమా

బ్లూ రే డివిడి లో "100%లవ్" సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్‍ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్‍ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన చిత్రం "100%లవ్".

ఈ 100%లవ్" సినిమాని ప్రసాద్ ఇయఫ్ఎక్స్ వారు బ్లూ రే డివిడి రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రసాద్ ఇయఫ్ఎక్స్ వారు తీసుకురాబోతున్న ఈ బ్లూ రే డివిడిలో హెచ్ డి 24 ఎఫ్ పి యస్ వీడియో, హెచ్ డి మాస్టర్ ఆడియో,డాల్బీ డిజిటల్ 5.1 సరౌండ్ సౌండ్ , ఇంప్రూవ్డ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, సాంగ్స్ మెను, పాప్ అప్ మెను ఆప్షన్ లు ఉంటాయి. "100%లవ్" సినిమా వందరోజులు పూర్తిచేసుకోగానే ఈ బ్లూ రే డివిడిలను మార్కెట్లోకి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ వారు. ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతూంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.