English | Telugu
ఏప్రెల్ 8 న నాగచైతన్య, తమన్న 100% లవ్ ఆడియో
Updated : Apr 5, 2011
ఈ ఏప్రెల్ 8 వ తేదీకి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి యువ హీరో ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసుకి అత్యంత ఆప్తమిత్రుడు అయిన అల్లు అర్జున్ జన్మదినం. కాగా మరొక ప్రత్యేకత ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో నాగచైతన్య సోదరుడు అక్కినేని అఖిల్ జన్మదినం కూడా కావటం విశేషం. ఈ నాగచైతన్య, తమన్న "100% లవ్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నాగచైతన్య, తమన్న "100% లవ్" చిత్రాన్ని ఏప్రెల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.