English | Telugu

నేను రెడీ... మీరు రెడీయేనా అంటున్న న‌యన్!

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఆగ‌స్టులో మూవీ రిలీజ్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. నేను రెడీ, మీరు రెడీయేనా అని అభిమానుల‌ను ఊరిస్తున్నారు. జ‌యం ర‌వితో న‌య‌న‌తార న‌టించిన సినిమా ఇరైవ‌న్‌. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఆగ‌స్టు 25న విడుద‌ల‌కు రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఒక‌టి కాదు,రెండు కాదు, నాలుగు భాష‌ల్లో ఇరైవ‌న్‌ని విడుద‌ల చేస్తున్నామ‌ని అన్నారు. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఇరైవ‌న్‌రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిపారు. సిల్వ‌ర్ స్క్రీన్ మీద గ‌ట్టిగా సంద‌డి చేసిన జోడీల్లో జ‌యం ర‌వి, న‌య‌న‌తార జోడీ కూడా ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి త‌ని ఒరువ‌న్ సినిమాను ఆల్రెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశారు. వాళ్లిద్ద‌రినీ క‌లిసి స్క్రీన్ మీద చూసి ఎనిమిదేళ్ల‌యింది.

ఈ విష‌యాన్ని జ‌యం ర‌వి ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత న‌య‌న్‌తో క‌లిసి న‌టించిన సినిమా రిలీజ్ అవుతోంద‌ని అన్నారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్ కూడా ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోంది. ర‌క్త‌పు మ‌ర‌కలున్న క‌త్తి క‌నిపిస్తోంది పోస్ట‌ర్‌లో. క‌త్తికి ఒక‌వైపు జ‌యం ర‌వి, మ‌రో వైపు న‌య‌న‌తార నిలుచుని ఉన్నారు. పోస్ట‌ర్‌ని బ‌ట్టి ఇది రివెంజ్ డ్రామా అని అంటున్నారు మేక‌ర్స్.

ఇరైవ‌న్‌లో జ‌యం ర‌వి పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. న‌య‌న‌తార రోల్ గురించి ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా ఉంచారు. యువ‌న్ శంక‌ర్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హరి కె వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మ‌ణికంద బాలాజీ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సైర‌న్‌లో న‌టిస్తున్నారు జ‌యం ర‌వి. అటు న‌య‌న‌తార జ‌వాన్ లో న‌టిస్తున్నారు. అది కాకుండా ఆమె చేతిలో రెండు, మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి.