English | Telugu

సినిమా పేరు:కె ర్యాంప్
బ్యానర్:హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 18, 2025

సినిమా పేరు: కె ర్యాంప్
తారాగణం:  కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్, సాయికుమార్, మురళి గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు 
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ 
ఎడిటర్: చోట కె ప్రసాద్ 
రచన, దర్శకత్వం: జైన్స్ నాని  
సినిమాటోగ్రాఫర్: సతీష్ రెడ్డి 
బ్యానర్ : హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్  
నిర్మాతలు: రాజేష్ దండా, శివ బొమ్మక్
విడుదల తేదీ: అక్టోబర్ 18 ,2025 

 'క' మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన 'కిరణ్ అబ్బవరం'(Kiran Abbavaram)ఈ ఏడాది మార్చిలో 'దిల్ రుబా' తో వచ్చి పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ రోజు థియేటర్స్ లో మరోసారి  k ramp తో  అడుగుపెట్టడంతో సినిమా ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
 
కథ
కుమార్(కిరణ్ అబ్బవరం) ఒక కోటీశ్వరుడు. కానీ లైఫ్ స్టైల్ మొత్తం 'లో' క్లాస్ లెవల్లో ఫుల్ మాస్ గా ఉంటుంది. తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి లైఫ్ మొత్తాన్ని ఎంజాయ్ చేయాలనుకునే మెంటాలిటీ. చదువులో పూర్ అయిన కుమార్ టెన్త్ క్లాస్ నుంచే విపరీతంగా ఆల్కహాల్ తాగుతుంటాడు. కానీ తండ్రి (సాయి కుమార్) కుమార్ ని ఒక్క మాట అనకుండా ఎంతో గారాబంగా పెంచుతాడు. డొనేషన్ కట్టి కేరళలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ చేస్తాడు. మెర్సీ జాయ్(యుక్తి తరేజా) ని చూసి తొలి చూపులోనే ప్రేమలోనే పడతాడు.  మొదటి మీటింగ్ లోనే ప్రేమ విషయం చెప్పి  లైఫ్ లాంగ్ నిన్ను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. మెర్సీ కూడా ఐ లవ్ యు చెప్తుంది. కానీ కుమార్ కి మెర్సీ గురించి ఒక నిజం తెలిసి ఆమె నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. కుమార్ కి మెర్సీ గురించి తెలిసిన నిజం ఏంటి? నిజంగానే మెర్సీ ప్రేమ నుంచి దూరంగా వెళ్లిపోయాడా? అసలు మెర్సీ కి  ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? వస్తే అవి ఎలాంటి సమస్యలు? కుమార్, మెర్సీ ప్రేమకి చిన్నప్పటి నుంచి కుమార్ ని భరిస్తున్న తండ్రి ప్రేమకి ఏమైనా సంబంధం ఉందా? చివరకి కుమార్, మెర్సీ ఒక్కటయ్యారా లేదా? అనేదే చిత్ర కథ 


ఎనాలసిస్ :

పాయింట్ కొత్తగా ఉండటంతో పాటు సినిమా మొత్తం చాలా సరదాగా ఎంటర్ టైన్ మెంట్ పంధాలో  సాగింది. కాకపోతే కుమార్ ఆల్కహాల్ తాగే సీన్స్ ని ఎక్కువగా చూపించారు. మూవీ ఎలాగు ఎంటర్ టైన్ మెంట్ పంధాలోనే వెళ్తుంది కాబట్టి, కుమార్ చేత మాకంటే పట్టి తాగుతున్నాం.ఆల్కహాల్ తాగకండని చెప్పించాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే  కుమార్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు కుమార్ యాటిట్యూడ్ బాగుంది.  కాకపోతే మాస్ లాగా బతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి అందుకు తగ్గ సన్నివేశాలని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి, అలాంటి వాళ్లలో ఇద్దరు స్నేహితులని పక్కన ఉంచుకోవడం చూపించాల్సింది. కొన్ని రొటీన్ సీన్స్ వచ్చినా కూడా, కేరళ రావడంతో కథనంలో వేగం పెరిగింది. మెర్సీ, కుమార్ ల పరిచయం సన్నివేశంతో పాటు, ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లోనే ఈ కథ ప్రాణం మొత్తం ఉంది కాబట్టి మెర్సీ ప్రేమ కోసం కుమార్ మరింతగా పరితపించడం, తనతో లైఫ్ ఎలా ఉండబోతుందో   ఊహించుకోవడం లాంటి సీన్స్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథలోకి వచ్చాక ప్రతి సీన్ ఎంతగానో నవ్వించింది. మెర్సీ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంది. మెర్సీ, కుమార్ తో పాటు ప్రతి క్యారక్టర్ స్క్రీన్ పై కనపడి  నవ్వులు పూయించాయి.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.  జీవిత సత్యాలని కూడా కొన్ని డైలాగుల ద్వారా చెప్పించారు. థియేటర్ నుంచి బయటకి మంచి హ్యాపీ మూడ్ తో రావడం ఈ చిత్రం స్పెషాలిటీ.  సాంగ్స్ బాగుంటే సినిమా రేంజ్ మరింతగా పెరిగేది.

నటీనటులు సాంకేతిక నిపుణులపనితీరు

కుమార్ క్యారక్టర్ లో 'కిరణ్ అబ్బవరం'ఎంతో ఎనర్జీతో చేసాడు. అగ్రహీరో రేంజ్ లో పెర్ ఫార్మెన్స్  ఉండటమే కాకుండా కామెడీలో కూడా విజృంభించాడు. సిల్వర్ స్క్రీన్ కి దొరికిన ఇంకో కమర్షియల్ హీరో అని చెప్పవచ్చు.  డైలాగ్ మాడ్యులేషన్ లో చేసిన ప్రయోగం కూడా వర్క్ అవుట్ అయ్యింది. మెర్సీ గా యుక్తి తరేజా(Yukti Thareja)పెర్ఫార్మ్ బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో హీరోయిన్ లుక్ అనిపించలేదు. సీనియర్ యాక్టర్స్ నరేష్ గారు, సాయికుమార్ గార్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరోసారి తమ అద్భుతమైన నటనతో కట్టిపడేసారు. వెన్నెల కిషోర్ కూడా మరోసారి తనదైన స్టయిల్లో నవ్వులు పూయించాడు.  దర్శకుడు, రచయితగా జైన్స్ నాని(Jains Nani)సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. డైలాగులు బాగున్నాయి. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నా, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సో సో


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్. కాకపోతే సెకండ్ హాఫ్  బాగుండటంతో పాటు   ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే కథనాలు నడిచి నవ్వులు పూయించాయి. కిరణ్ అబ్బవరం పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్.   

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.50