Read more!

English | Telugu

సినిమా పేరు:యువత
బ్యానర్:వర్త్ వాచింగ్ ఎంటర్ టైన్ మెంట్
Rating:3.00
విడుదలయిన తేది:Nov 7, 2008
తల్లీతండ్రీ లేని బాబు (నిఖిల్‌) తన మేనమామ వద్ద పెరుగుతాడు. ఎంతసేపూ ఎదుటివారి మీద ఆధారపడి జీవించటమే అతనికి తెలిసినది. అంతేకానీ తన జీవితానికో గమ్యం, లక్ష్యం అంటూ ఏం ఉండవు. అంటే పరమ బేవార్సు మనిషన్నమాట. ఓ సందర్భంలో మేనమామతో గొడవపడి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితుల వద్దకు వెళతాడు బాబు. అక్కడ అమెరికాకి వెళ్ళాలనుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆజయ్‌ (రణధీర్‌), పోలీసాపీసర్‌ అవుదామని కలలు కంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కిరణ్‌ (నరసింహ), సినిమా పరిశ్రమలో గొప్ప డైరెక్టర్‌ అవ్వాలని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సుబ్బు (సుభాష్‌)లు ఉంటారు. అజయ్‌ తన ఇంటి ఓనర్‌ మాధవి (మోహన్‌ చౌహాన్‌)ని ప్రేమిస్తుంటాడు. వాళ్ళమీద పడి బాబు బ్రతికేస్తుంటాడు. ఆ క్రమంలో మెడిసన్‌ చేస్తున్న బేబీ అని పిలవబడే విశాలాక్షి (అక్ష) బాబుకి పరిచయమవుతుంది. అతని బోళాతనం ఆమెకు నచ్చుతుంది. దాంతో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఓ సారి అక్ష గురించి కొందరు రౌడీలను కొడతాడు బాబు. ఆ పగతో వాళ్ళు మరోసారి దాడి చేయగా, ఆ దాడిలో సుబ్బు తీవ్రంగా గాయపడతాడు. అతనికి వైద్యం చేయించటానికి 5 లక్షలు లడ్డూ (నర్సింగ్‌ యాదవ్‌) అనే రౌడీ వద్ద వారం రోజుల్లో తిరిగిచ్చే కండిషన్ మీద అప్పుగా తీసుకుంటాడు బాబు. వారం రోజుల్లో ఆ డబు్బ తిరిగివ్వకుంటే తన ఫ్రెండ్స్‌ నలుగురినీ చంపేస్తానంటాడ లడ్డూ. దాంతో గత్యంతరం లేక కిరణ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బ్యాంక్‌కి తన స్నేహితుడితో కలసి కన్నం వేస్తాడు బాబు. అక్కడ అప్పటికే 20 కోట్ల రూపాయల దొంగతనం జరిగి ఉంటుంది. వీళ్ళు పోలీసులకు దొరికిపోతారు. ఆ తర్వాతేమయిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
కొత్తవాడైనా దర్శకుడు సినిమాని బాగానే లాక్కొచ్చాడు కానీ అక్కడక్కడ కొంచెం లాజిక్కు మిస్సయినట్లనిపిస్తుంది. కథనం కొత్తగా చెప్పే ప్రయత్నం బాగుంది. అక్షకి ఓ అజ్ఞాత వ్యక్తి మంచి వార్నింగ్‌ కాల్స్‌ వస్తుంటాయి. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని దర్శకుడు మర్చిపోవటం, మెడిసన్‌ చదివే అమ్మాయి ఏ బాధ్యతలేని అబ్బాయిని ప్రేమించటం బహుశా తెలుగు సినిమాల్లోనే జరుగుతుందేమో. అలాగే లడ్డూ దాదా 5 లక్షలిచ్చి ఆ తర్వాత 50 లక్షలు తెమ్మనటం, అది మర్చిపోయినట్లు మళ్ళీ తర్వాత 5 లక్షలే ఇమ్మనటం వంటివి దర్శకుడు కొంచెం పట్టించుకునుంటే బాగుండేది. స్ర్కీన్‌ప్లే ఓ.కె. టేకింగ్‌ పరంగా కూడా దర్శకుడు బాగానే తీశాడనిపించుకుంటాడు. అతను వ్రాసిన డైలాగ్స్‌ కొన్ని బాగున్నాయి. ఉదాహరణకు "ఆలోచించి చేసేందుకిది వ్యాపారం కాదు స్నేహం'', "ఇద్దరు కలిస్తే పుడతాం.. నలుగురు కలిస్తే పోతాం''. అసలైన జీహాద్‌ అంటే మనం సంతోషంగా ఉండటం, పదిమందిని సంతోషంగా ఉంచటం'' వంటి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నటన:- నిఖిల్‌ డైలాగ్‌ మాడ్యులేషన్ చాలా మెరుగుపరచుకోవాల్సి ఉంది. తెలుగు భాష మీద అతనికి అవసరమైనంత పట్టులేదనే విషయం అర్థమవుతుంది. అతని నటన కూడా ఇంకా మెరుగుపరుచుకోవాలి. మిగిలిన స్నేమితుల వేషాలేసిన వాళ్ళు కూడా అమెచ్చూర్స్‌ అనే విషయం జానానికి తెలిసిపోతుంది. ఇక మిగిలిన వాళ్ళు హైదరాబా బాద్‌సాగా సోనూసూద్‌, జీవా, లడ్డూగా నర్సింగ్‌ యాదవ్‌, జైలర్‌గా జయప్రకాష్‌రెడ్డి, సెంట్రీగా శ్రీనివాసరెడ్డిలతో పాటు సిమ్రాన్‌ వీక్‌నెస్‌ ఉన్న వ్యక్తిగా షాయాజిషిండే నటన ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కామెడీ బాగుంది. అక్ష కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఆమె నిఖిల్‌కి అక్కలా ఉంది. నటన విషయంలో ఆమె ఫరవాలేదు. సంగీతం:- చెప్పుకోదగినంత స్థాయిలో మణివర్మ సంగీతం లేకపోయినా, చెత్తగా కూడా లేదు. ఈ సినిమాలో సంగీతం ఒ.క. వినొచ్చు. సినిమాటోగ్రఫీః- బాగుంది. ముఖ్యంగా పాటల్లో కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ :- చక్కగా ఉంది. యాక్షన్‌ :- రామ్‌-లక్ష్మణ్‌ ఈ చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌ని నీట్‌గా కంపోజ్‌ చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది బాక్సాపీస్‌ని కుదిపేంత గొప్ప సినిమా కాకపోయినా చెత్త సినిమా మాత్రం కాదు ఓ సారి చూడొచ్చు.