English | Telugu

సినిమా పేరు:వర్జిన్ స్టోరి
బ్యానర్:రామలక్ష్మి సిని క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 18, 2022

సినిమా పేరు: వర్జిన్ స్టోరి
తారాగ‌ణం: విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
సంగీతం: అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్: గ్యారీ,
సాహిత్యం: భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర,
నిర్మాతలు: లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి

టీనేజ్ లవ్ స్టోరీలతో తెలుగులో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అందులో 'వర్జిన్ స్టోరి' ఒకటి. టీనేజ్ స్టోరీతో, టీనేజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ టైటిల్ తో అటెన్షన్ ఏర్పడేలా చేసిన ఈ మూవీ ఏ మేరకు అలరించిందో చూద్దాం.

కథ:- తాను ఎంతగానో ప్రేమించిన తన బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రియాంషి(సౌమిక పాండియన్) అతనికి బ్రేకప్ చెప్పి బాధపడుతుంటుంది. బ్రేకప్ బాధలో నుంచి ప్రియను బయటకు తీసుకురావడం కోసం ఆమె ఫ్రెండ్ మీనాక్షి(రిషిక ఖన్నా) ఒక ఐడియా చెప్తుంది. అదే 'వన్ నైట్ స్టాండ్'. ఒక రాత్రి తెలియని వ్యక్తితో గడిపి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీర్చుకోమని సలహా ఇస్తుంది. అలా 'వన్ నైట్ స్టాండ్'కి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇద్దరూ కలిసి పబ్ కి వెళ్తారు. అక్కడ ప్రియ.. విక్రమ్(విక్రమ్ సహిదేవ్)ని సెలెక్ట్ చేసుకుంటుంది. వర్జిన్ అని బ్రదర్, ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుండటంతో.. వర్జినిటీ కోల్పోయే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కి.. ప్రియ రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఆమె వచ్చి 'వన్ నైట్ స్టాండ్' అని అడగ్గానే వెంటనే ఒప్పేసుకుంటాడు. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోకుండా, కేవలం ఈ ఒక్క రాత్రి గడిపి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటారు. అయితే వారు ఆ రాత్రి గడపటానికి చోటు ఉండదు, వారి దగ్గర సరిపడా డబ్బులు కూడా ఉండవు. దీంతో వారు ప్లేస్ వేటలో పడతారు. ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది? ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? ప్రియ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీర్చుకుందా? విక్రమ్ తన వర్జినిటీ కోల్పోయాడా? అనేది తెర మీద చూడాలి.


ఎనాలసిస్ :

'వర్జిన్ స్టోరి' అనేది ఒక రాత్రిలో జరిగే కథ. సాధారణంగా థ్రిల్లర్, హారర్ సినిమాలు ఒక రోజు లేదా ఒక రాత్రిలో జరగడం చూస్తుంటాం. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలా వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఇక్కడ 'వర్జిన్ స్టోరి' కథ వేరు. ఇది థ్రిల్లర్ కాదు, ఓ రొమాంటిక్ కామెడీ సినిమా. ఇద్దరు టీనేజర్స్ ఒక రాత్రి గడపటం కోసం వారికి అనువైన చోటు కోసం వెతుకుతుంటారు. దీన్ని ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చూపించాలంటే కామెడీ ఉండాలి. డైరెక్టర్ కూడా అదే పని చేశాడు. కానీ కామెడీనే అంతగా వర్కౌట్ అవ్వలేదు.

'వన్ నైట్ స్టాండ్' కాన్సెప్ట్ తో టీనేజర్స్ ని టార్గెట్ చేస్తూ తెలుగులో సినిమా తీయాలనుకోవడం సాహాసం అనే చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ కి తగ్గట్లే సినిమా అంతా ఒక్క రాత్రిలో చూపించాలి అనుకోవడం ఇంకా పెద్ద రిస్క్. డైరెక్టర్ ప్రదీప్ బి అట్లూరి ఆలోచన కాస్త భిన్నంగా ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యాడు. విక్రమ్, ప్రియ ఒక ప్లేస్ కి వెళ్ళడం.. అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి మరొక ప్లేస్ కోసం వెతకడం. సినిమా చివరిదాకా ఇదే తంతు. హోటల్, ఫ్రెండ్ ఫ్లాట్, బూత్ బంగ్లా ఇలా ఎన్నో ప్లేస్ లకి వెళ్తుంటారు. అక్కడ కొన్ని కామెడీ ట్రాక్ ల రూపంలో అడ్డంకులు ఎదురవుతాయి. అవ్వి నవ్వు తెప్పించకపోగా, బోర్ కొట్టిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ బొమ్మలని మనుషుల్లా భావిస్తూ వాటితో మాట్లాడుతుంటాడు. ఆ ట్రాక్ ఏ మాత్రం నవ్వు తెప్పించలేదు. దానికి తోడు ఓ మతి మరుపు బామ్మ టిక్ టాక్ పిచ్చి ఉన్న ఒకతని ఆటో ఎక్కుతుంది. ఆ ట్రాక్ కూడా నవ్వించలేకపోయింది. అంతోఇంతో విక్రమ్ ఫ్రెండ్ క్యారెక్టరే కాస్త నవ్వించాడు.

సినిమా ఎక్కువ భాగం పబ్ లో ఉండటం, పార్టీ సీన్స్ ఉండటంతో.. ఆడియన్స్ కి థియేటర్ లో ఉండి సినిమా చూస్తున్నామన్న ఫీల్ కంటే.. పబ్ కో, పార్టీకో వచ్చి ఎవరో ఎంజాయ్ చేస్తుంటే మనం చూస్తూ కూర్చున్నాం అన్న ఫీల్ కలుగుతుంది. ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేయలేకపోవడమే ఆ ఫీల్ కలగడానికి కారణమని చెప్పొచ్చు.

ఈ సినిమాలో డైలాగ్స్ పర్లేదు. 'వార్ గెలవాలంటే కొన్నిసార్లు బోర్డర్ క్రాస్ చేయాలి', 'వర్జినిటీ అంటే ప్యూరిటీ.. అది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకి సంబంధించింది' వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. మిగతా విభాగాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్ల‌స్ పాయింట్స్‌:
స్టొరీ పాయింట్
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
బ‌ల‌మైన స‌న్నివేశాలు లేకపోవడం

న‌టీన‌టుల ప‌నితీరు:- విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ ఉన్నంతలో బాగానే నటించారు. సన్నివేశాల్లో బలం ఉంటే వారి నటన ఎలివేట్ అయ్యుండేది. రాకెట్ రాఘవ ఏ మాత్రం నవ్వించలేకపోయాడు. ఆ కామెడీ ట్రాకే వీక్ గా ఉండటంతో తనేం చేయలేకపోయాడు. తాగుబోతు రమేష్ ఒక సన్నివేశంలో మెరిశాడు. అది తనకి గానీ, సినిమాకి గానీ ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. విక్రమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన కుర్రాడు ఉన్నంతలో బాగానే నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఆలోచన బాగున్నా కథనంలో వేగం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో 'వర్జిన్ స్టోరి' బోరింగ్ స్టోరిగా మిగిలిపోయింది.

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25