English | Telugu

సినిమా పేరు:తిరగబడర సామి
బ్యానర్:సురక్ష ఎంటర్టైన్మెంట్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 2, 2024

సినిమా పేరు: తిరగబడరా సామి
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, రఘుబాబు, మన్నారా చోప్రా,మకరంద్ దేశ్ పాండే, ప్రగతి, జాన్ విజయ్ ,రాజా రవీంద్ర తదితరులు   
సంగీతం: జె బి  
సినిమాటోగ్రఫీ:జవహర్ రెడ్డి  
ఎడిటర్: ప్రసన్న జి.కే
రచన, దర్శకత్వం: ఏ ఎస్ రవికుమార్ చౌదరి 
నిర్మాత: మల్కాపురం శివకుమార్ 
బ్యానర్: సురక్ష ఎంటర్ టైన్మెంట్స్   
విడుదల తేదీ: అగస్ట్ 2 , 2024 

దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరి సినిమాలకి ఒక బ్రాండ్ ఉంది. యజ్ఞం, వీరభద్ర, పిల్లనువ్వు లేని జీవితం సినిమాల విజయాలే అందుకు ఉదాహరణ. అలాగే రాజ్ తరుణ్ కి ఒక బ్రాండ్ ఉంది. ఉయ్యాలజాంపాల, కుమారి 21 ఎఫ్ ,లవర్, ఒరేయ్ బుజ్జిగా చిత్రాలే అందుకు ఉదాహరణ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఈ రోజు వచ్చిన తిరగబడరా సామి ఎలా ఉందో చూద్దాం.

కథ

గిరి(రాజ్ తరుణ్ ).. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన  లేదా  తప్పిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే పనిని వృత్తిగా పెట్టుకుంటాడు. అదే విధంగా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో కూడా ఉంటాడు. ఇంకో పక్క కరుడు గట్టిన రౌడీ అయినటువంటి  కొండా రెడ్డి(  మకరంద్ దేశ్ పాండే)అతని  మనుషులు ఒక వ్యక్తి కోసం వెతుకుతుంటారు.ఆ టైం లో ఒక అనాధ అయిన   శైలజ (మాల్వీ మల్హోత్ర) గిరి లైఫ్ లోకి వస్తుంది.శైలజ ని ప్రేమిస్తాడు.  అదే టైం లో కొండారెడ్డి నుంచి గిరి కి ఒక డీల్ వస్తుంది. మరి  కొండారెడ్డి ఇచ్చిన డీల్ ఏంటి? అసలు గిరి ఎంచుకున్న వృత్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు శైలజ ఎవరు? గిరి ప్రేమ ఏమైంది? అనేదే ఈ కథ  


ఎనాలసిస్ :

కథకి ,స్క్రీన్ ప్లే కి ప్రాధాన్యమిచ్చే ఏఎస్ రవి కుమార్ చౌదరి నుంచి ఇలాంటి సినిమా రావడం ఒకింత ఆశ్చర్యమే. సినిమా చూస్తున్నంత సేపు కూడా  ప్రేక్షకుడి మైండ్ లో ఆ విషయం మెదులుతూనే ఉంటుంది. మూవీ  స్టార్టింగే కొంత మంది రౌడీలు కామన్ పీపుల్స్ కి  ఫోటో ఒకటి  చూపించి ఎక్కడైనా చూసారా అని అడుగుతారు. చూడలేదని చెప్పగానే మేము వెతుకుతున్న సంగతి  ఎవరికి తెలియకూడదని చంపేస్తారు. ఆ విషయం మీదే పేపర్స్ లో వస్తు టైటిల్స్ ప్రారంభం అవుతాయి. అది చూడగానే చౌదరి మార్క్ తో సినిమా ఉండబోతుందని ఆనందపడతాం. కానీ ఒక రెండు మూడు సీన్స్ తర్వాత కానీ మన ఆశలు అడియాసలు అవుతున్నాయని అర్ధమవుతుంది. ఫస్ట్ ఆఫ్ లో హీరో క్యారక్టరయిజేషన్ కొత్తగానే ఉన్న కూడా దాని చుట్టూ  అల్లు కున్న కథనాలు, పాత్రలు నాసిరకంగా ఉన్నాయి. పైగా కమర్షియల్ సినిమా పుట్టినప్పటినుంచి అలాంటివి వస్తూనే  ఉన్నాయి. హీరోయిన్ పాత్ర తీరు తెన్నులు బాగానే ఉన్నా కూడా కథ లో విషయం లేకపోవడంతో తేలిపోయింది. రాజ్ తరుణ్, మాన్వీ  మధ్య వచ్చే సీన్స్ కూడా రొటీన్ గానే ఉన్నాయి. ఇక సెకండ్ ఆఫ్ అయితే వాళ్లిద్దరు  చేసింది ఏమి లేదు. ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ కి ముందు మాత్రమే తిరగబడతారు.  కామెడీ యాక్టర్స్ మధ్యనే ఎక్కువ భాగం నడిచింది.అదే విధంగా  ఎంటైర్  సినిమా మొత్తం విలన్ చేసింది  ఏమి లేదు.అసలు హీరో క్యారక్టరైజేషన్ హీరోయిన్ కి హీరోయిన్ క్యారక్టరైజేషన్ హీరోకి ఫిక్స్ చేసినా బాగుండేదేమో. 
  
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

రాజ్ తరుణ్(raj tarun) నటనలో మెరుపులు ఏమి లేవు. ఒక సాధారణ వ్యక్తిగా గెటప్ బాగున్నా కూడా పెర్ఫార్మ్ చెయ్యడానికి ఏమి లేదు. ఇక మాల్వి మల్హోత్రా(malvi malhotra) మాత్రం సూపర్ గా చేసింది. తను నటిస్తుంటే పక్కింటి అమ్మాయి మనతో ఏదో చెప్తున్నట్టుగా ఉంది. ఏ కొంత మంది హీరోయిన్స్ కో సిల్వర్ స్క్రీన్ ఆ అదృష్టాన్ని ఇస్తుంది.మరిన్ని  అవకాశాలు వస్తే  మంచి నటిగా ప్రూఫ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక విలన్ గా చేసిన మకరంద్ దేశ్ పాండే కి చెయ్యడానికి ఏమి లేదు.అరుపులు కాస్ట్యూమ్ తప్ప ఏమి లేదు. ఇక మన్నారా చోప్రా లేడీ విలన్ గా అంతగా సూటవ్వలేదు. ఆమెకి  కూడా అరుపులే మిగిలాయి. ఇక మిగతా పాత్రల్లో చేసిన రఘుబాబు,ప్రగతి, రాజా రవీంద్ర లాంటి వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ ని ఎప్పుడో చేసారు. ఇక ఏఎస్ రవికుమార్ దర్శకత్వ మెరుపులు కొన్ని చోట్ల కనపడినా కూడా కథ కథనాలు లేకవడంతో విసుగు వస్తుంది. ఇక అందరికి కంటే గొప్పగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు గురించి. జె బి సంగీతంలోని పాటలు బాగున్నాయి. పెద్ద సినిమా పాటలకే బయటకెళ్తున్న ఈ రోజుల్లో జె బి తన మార్కు తో  కూర్చోబెట్టాడు. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. నిర్మాణ విలువలు గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే  తిరగబడరా సామి కి  కథ కధనాలు  ఉండి ఉంటే కనుక ఎవరైనా బాగోలేదని అంటే ప్రేక్షకులు తిరగబడి హిట్ అని చెప్పే వాళ్ళు. ఆ  ధైర్యాన్ని మేకర్స్ ఇవ్వలేదు.

- అరుణాచలం

తెలుగు వన్ రేటింగ్ : 2.50

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25