Read more!

English | Telugu

సినిమా పేరు:సుందరం మాస్టర్
బ్యానర్:ఆర్.టి టీం వర్క్స్ , గోల్డెన్ మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:Feb 23, 2024

సినిమా పేరు: సుందరం మాస్టర్ 
తారాగణం: హర్ష చెముడు, దివ్య శ్రీపాద,హర్ష వర్ధన్, భద్రం, షాలిని నంబు, శ్వేత, బాలకృష్ణ నీలకంఠాపూర్ తదితరులు 
సంగీతం: సాయి చరణ్ పాకాల 
కెమెరా : దీపక్ 
ఎడిటర్: కార్తీక్ 
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
రచన, దర్శకత్వం:కళ్యాణ్ సంతోష్ 
నిర్మాతలు :రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
బ్యానర్: ఆర్.టి టీం వర్క్స్ , గోల్డెన్ మీడియా  
విడుదల తేదీ: ఫిబ్రవరి 23  2024 

షార్ట్స్ ఫిలిమ్స్ లో కామెడీ ని పండించే స్థాయి నుంచి సినిమాల్లో కామెడీ ని పండించే స్థాయికి ఎదిగిన నటుడు హర్ష చెముడు అలియాస్ హర్ష వైవా. లేటెస్ట్ గా సుందరం మాస్టర్ తో సోలో హీరోగా వచ్చాడు. మరి మూవీ  ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం.
 కథ
సుందరం ( హర్ష చెముడు)  గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ టీచర్ గా వర్క్ చేస్తుంటాడు. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ఏరియా ఎంఎల్ఏ ( హర్ష వర్ధన్ ) సుందరంతో ఇంగ్లీష్ టీచర్ గా ఒక అడవిలో ఉండే మనుషుల దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్న ఒక రహస్యాన్ని కనుక్కోవాలని అంటాడు. అలా చేసి పెడితే డిఈఓ ని చేస్తా అంటాడు. కట్నం ఎక్కువ వస్తుందనే ఆశతో సుందరం అడవికి వెళ్తాడు.ఇక ఆ అడవిలో ఉన్న వాళ్ళకి  ఇండియాకి స్వాతంత్రం వచ్చిందన్న విషయం కూడా తెలియదు. కానీ ఆ అడవి మనుషులే సుందరానికి ఇంగ్లీష్ నేర్పుతారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఈ క్రమంలో హర్ష చెముడు అడవి లో ఉన్న రహస్యాన్ని ఎలా  కనుక్కున్నాడు? అసలు ఎంఎల్ఏ హర్ష ని మాత్రమే అక్కడికి ఎందుకు పంపించాడు?  ఇంతకీ అడవిలో ఉన్న రహస్యం ఏంటి? హర్ష కి అదే అడవి పిల్ల   దివ్య శ్రీపాద సహాయం చేసిందా? హర్ష డిఈఓ కోరిక నెరవేరిందా? అనేదే ఈ చిత్ర కథ.


ఎనాలసిస్ :

కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మనం ప్లాప్ సినిమాకి వచ్చాము  అనే భావన కలుగుతుంది. ఇప్పుడు సుందరం మాస్టర్ ని చూస్తుంటే సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది. ఏ సినిమాలో అయినా మేము నటిస్తున్నాము అనే ఫీలింగ్ ని ఆయా క్యారక్టర్ లు ప్రేక్షకులకి కలగనియ్యవు. కానీ ఇందులో మాత్రం మేము నటిస్తున్నామనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. ప్రతి ఫ్రేమ్ లోను ఆ విషయం అర్ధం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే  హర్ష చెముడు కి  అడవిలో వాళ్ళకి మధ్య నాలుగు కామెడీ డైలాగ్ లు పెడితే అదే సినిమా అయిపోతుందని టీం మొత్తం భావించినట్టుంది.రెండు గంటల సినిమా అంటే అన్ని అంశాలు ఉండాలనే విషయాన్నీ మరిచిపోయి ఇంగ్లీష్ డైలాగ్ లకి ప్రాధాన్యం ఇవ్వడం ఏంటో మేకర్స్ కే తెలియాలి. నల్లగా ఉండే వాళ్ళని అడవిలో వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో అనే క్లారిటీ కూడా లేదు. హీరోయిన్ శ్రీ పాద ని కూడా లేట్ గా ఇంట్రడ్యూస్ చేసారు. ఇంగ్లీష్ ని  తప్పు చెప్పడమే కామెడీ అనుకుని నడిపించారు. ఇక సెకండ్ ఆఫ్ అయినా ఒక మాదిరిగా ఉంటుందనుకుంటే అది కూడా ప్రేక్షకుడు సహనాన్ని పరీక్షించింది. అసలు దొంగ ఎవరో చెప్పే ప్రాసెస్  ప్రేక్షకుడ్ని సహనానికి గురిచేస్తుంది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
హర్ష వైవా సుందరం మాస్టర్ క్యారక్టర్ లో బాగానే చేసాడు. కానీ తన క్యారక్టర్ కి  సరైన విధి విధానం లేకపోవడంతో తేలిపోయాడు. ఈ సారి సోలో హీరోగా వచ్చేటప్పుడు స్క్రిప్ట్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవడం నయం. ఇక దివ్యశ్రీపాద  అడవి పిల్ల క్యారక్టర్ లో సరిగ్గా సరిపోయింది. కానీ తను పెద్దగా నటించడానికి  ఏమి లేదు. మిగతా క్యారక్టర్ ల విషయానికి వస్తే  నటన పరంగా పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు.హర్ష కి సహాయపడే కుర్రోడు మాత్రం బాగా చేసాడు. ఎంఎల్ ఏ క్యారక్టర్ లో హర్ష వర్షన్ బాగున్నాడు.ఒక కొత్త హర్షవర్ధన్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక దర్శకుడు విషయానికి వస్తే  తన ఊహలో పుట్టిన కథ ని పూర్తి స్క్రిప్ట్ గా మలుచుకోవడంలో చాలా సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయ్యాడు. ఇక అంతకు మించి చెప్పుకోవడానికి మెరుపులు ఏమి లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగా ఉన్నాయి. కెమెరా, సంగీతం వీటి గురించి కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఏ కామెడీ సినిమా అయినా  ప్రేక్షకులని నవ్వించాలంటే కథలో కామెడీ రావాలి. అంతే గాని సీన్స్ లో  రాకూడదు. అలాగే సినిమాలో డైలాగ్ లు ఉండాలి గాని  డైలాగ్ ల్లో సినిమా ఉండకూడదు. ఒక వేళా అలా ఉంటే  సుందరం మాస్టర్ లా తయారవుతుంది. మొత్తానికి ఈ మూవీ  సినిమాకి తక్కువ షార్ట్ ఫిలిం కి ఎక్కువ.

- అరుణాచలం