English | Telugu
బ్యానర్:గీతా ఆర్ట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 5, 2016
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. పరిచయ చిత్రమైన "గౌరవం"తో డిజాస్టర్ చవిచూసిన అనంతరం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన "కొత్త జంట"తో పర్వాలేదనిపించుకొన్నాడు. ముచ్చటగా మూడో ప్రయత్నంగా అల్లు శిరీష్ నటించిన సినిమా "శ్రీరస్తు శుభమస్తు". పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. నేడు (ఆగస్ట్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హీరోగా అల్లు శిరీష్ కు హిట్టునిచ్చిందో? లేదో? చూద్దాం..!!
కథ: సిరి అలియాస్ శిరీష్ (అల్లు శిరీష్) ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. తొలిచూపులోనే అనన్య అలియాస్ అను (లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. అయితే.. ఆగర్భ శ్రీమంతుడైన తన తండ్రి (ప్రకాష్ రాజ్) పేదింటి అమ్మాయి అయిన అను ను పెళ్లాడడానికి ఒప్పుకోడని తెలిసి. తాను కూడా డబ్బున్నవాడిని అన్న విషయం చెప్పకుండా అను ప్రేమను గెలుచుకొని.. తన ప్రేమకు డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేయాలనుకొంటాడు. అనుకొన్నట్లుగానే అను జీవితంలోకి ప్రవేశిస్తాడు సిరి. ఆ తర్వాత వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరిగాయి? అను ప్రేమను సిరి దక్కించుకోగలిగాడా? చివరికి వీరి ఎలా జరిగింది? అనేది "శ్రీరస్తు శుభమస్తు" చిత్ర కథాంశం!
ఎనాలసిస్ :
నటీనటుల పనితీరు: ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ వరకూ బానే చెప్పాడు కానీ.. హావభావాల వ్యక్తీకరణలో అల్లు శిరీష్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. లావణ్య త్రిపాఠిని ఎడిపించే సన్నివేశాలు, రావు రమేష్ తో మాట్లాడే సందర్భాల్లో అల్లు శిరీష్ ఇంకాస్త చక్కని నటన కనబరిస్తే సినిమా రిజల్ట్ కాస్త బెటర్ గా ఉండేది. అను పాత్రలో లావణ్య ఒదిగిపోయింది. తండ్రి మీద గౌరవాన్ని, ప్రేమించిన అబ్బాయి మీద ఇష్టాన్ని ఒకేసారి ఎలా చూపించాలో తెలియక తికమక పడే పాత్రలో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తండ్రి పాత్రలో రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు పోటీపడి నటించారు. సహాయ పాత్రల్లో తనికెళ్లభరణి, సుమలతలు ఫర్వాలేదనిపించుకొన్నారు.
అలీ-సుబ్బరాజు కాంబినేషన్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో పంచ్ డైలాగుల్లో డబుల్ మీనింగ్ వినిపించినప్పటికీ.. మాస్ సెక్షన్ ఆడియన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రభాస్ శ్రీను కూడా తన పాత్ర పరిధిమేరకు నవ్వించడానికి ప్రయత్నించి ఓ మోస్తరుగా సఫలమయ్యాడు.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ బాణీలు బాగున్నాయి. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఎమోషనల్ సీన్స్ లో సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ పడక ఆడియన్ సీన్ కు కనెక్ట్ కాలేకపోయాడు. మనికంతన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కాశ్మీర్ అందాలను చక్కగా తెరకెక్కించాడు. కాకపోతే.. డిఐ ఎఫెక్ట్ కాస్త ఎక్కువవ్వడంతో స్క్రీన్ మరీ బ్రైట్ గా కనిపిస్తుంది. ఎమోషన్ కి తగ్గట్లు లైటింగ్ వినియోగించి ఉంటే ఇంకాస్త బాగుండేది. మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ వల్ల సినిమాలో ల్యాగ్ ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా సెకాండాఫ్ లో స్క్రీన్ ప్లే పరిగెడుతూ ఫస్టాఫ్ లో ఉన్న డల్ నెస్ ను పోగొడుతుంది
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
"యువత, సోలో, సారోచ్చారు" లాంటి సినిమాలను తెరకెక్కించిన పరశురామ్ "శ్రీరస్తు శుభమస్తు" సినిమా విషయంలో కూడా మునుపటిలాగే కథనంపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టలేదు. 80ల కాలం నుంచి చూస్తున్న కథనే కొత్తగా ప్రెజంట్ చేద్దాం అనే ప్రయత్నంలో తడబడ్డాడు. అయితే.. డైలాగ్స్ పరంగా ఎమోషన్స్ ను పండించిన తీరు అద్భుతం. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని, డబ్బు విలువను చాలా చిన్న చిన్న లాజిక్స్ తో పామరుడికి సైతం అర్ధమయ్యేలా చెప్పిన తీరును మెచ్చుకొని తీరాల్సిందే. క్లైమాక్స్ లో తన మునుపటి చిత్రం "సోలో" ఛాయలు కనపడినప్పటికీ.. ఓవరాల్ గా "శ్రీరస్తు శుభమస్తు"తో అలరించాడనే చెప్పాలి. ఫస్టాఫ్ ను ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది.
ఫస్టాఫ్ ను కాస్త ఓపిగ్గా భరించగలిగితే.. సెకండాఫ్ అలీ పంచే కామెడీ పుణ్యమా అని "శ్రీరస్తు శుభమస్తు" చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు!