Read more!

English | Telugu

సినిమా పేరు:శంభో శివ శంభో
బ్యానర్:శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 14, 2010
కరుణాకర్(రవితేజ), మల్లి(అల్లరి నరేష్), చందు(శివ బాలాజీ) ముగ్గురు చిన్ననాటి స్నహితులు. కరుణాకర్ కి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని, చందు కి కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలని, మల్లి కి విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో ఉంటారు. మణెమ్మ(ప్రియమణి) కరణాకర్ మరదలు ఆమెని పెళ్లి చేసుకోవాలంటే కరుణాకర్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని మణెమ్మ తండ్రి (తనికెళ్ళ భరణి) కండిషన్ పెడతాడు. ఈ ముగ్గురు స్నేహితులు వాళ్ళవాళ్ళ లక్ష్యాలకు చేరువవుతున్న సమయంలో కరుణాకర్ క్లాస్ మెట్, ఎక్స్ ఎంపీ భవానీ (రోజా) కొడుకు సంతోష్ కరుణాకర్ ఇంటికి వస్తాడు.ప్రేమలో విఫలమైన సంతోష్ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో అతన్ని రక్షిస్తారు ముగ్గురు స్నేహితులు. కర్నూలు లో కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టైన నరసింహారెడ్డి (ముఖేష్ రుషి) కూతురు ప్రభని ప్రేమిస్తున్నాడని, ఆమె లేకపోతే చనిపోతాడని తెలుసుకున్నకరుణాకర్, మల్లి, చందులు ప్రాణాలకు తెగించి సంతోష్, ప్రభలను కలుపుతారు. వారిద్దరినీ కలిపే క్రమంలో చందు కాలు పోగొట్టుకుంటాడు, మల్లి చెవిటివాడవుతాడు, కరుణాకర్ తన బామ్మని పోగొట్టుకుంటాడు. మొత్తానికి వారి లక్ష్యాలు గాలిలో కలిసిపోతాయి. వారి జీవితాలనే పణంగా పెట్టి కలిపిన ఆ జంట మాత్రం కొద్దిరోజులక విడిపోవాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
నా స్నేహితుడి స్నేహుతుడు నాకూ స్నేహితుడే.. అన్న కాప్షన్ తో ఈ సినిమా మొదలవుతుంది. నేటి యువతరం ఆలోచనా సరళికి అద్దం పట్టే విధంగా ఈ చిత్రం ఉంది. యువతి యువకులలో ఆలోచన కలిగింపజేసే చిత్రం ఇది. చక్కటి కథ, కథనాలతో సినిమా చూస్తున్న ప్రేక్షకుల మదిలో నాటుకుపోయే విధంగా సన్నివేశాలు ఉండటం ఈ చిత్రం ప్లస్ పాయింట్. చక్కటి కథకు తగ్గట్టుగా ముగ్గురు స్నేహితులుగా రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీల పాత్రలు మధ్యతరగతి కుటుంబాలలో ఉండే యువకుల మనోభావాలకి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. స్నేహం విలువను చాటిచెప్పిన ఈ చిత్రం యువతీ యువకుల మనసుని హత్తుకుంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: ఈ చిత్రానికి రవితేజ నటన హైలెట్ గా నిలుస్తుంది. గమ్యం చిత్రం తర్వాత అలాంటి స్థాయి పాత్ర ఈ చిత్రం ద్వారా నరేష్ కి లభించింది. తన స్టైల్ లో అల్లరి నరేష్ బాగా నటించాడు. శివబాలాజీ కూడా చక్కగా నటించాడు. రాజకీయాలలో బిజీ అయిపోయిన రోజా ఈ చిత్రం ద్వారా మళ్ళీ తెరంగేట్రం చేయటం విశేషం. మిగతా పాత్రలలో ప్రతిఒక్కరూ చాలా బాగా చేశారు. సంగీతం-:సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫైట్స్-: రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. డాన్స్-: డాన్స్ మాస్టర్ దినేష్ కంపోజ్ చేసిన డాన్స్ బాగుంది. దర్శకత్వం-: కథ, కథనాలలో ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.చివరగా నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది.