Read more!

English | Telugu

సినిమా పేరు:సీతారాముల కళ్యాణం లంకలో
బ్యానర్:వెల్ ఫేర్ క్రియేషన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jan 22, 2010
చందు (నితిన్‌) ఓ కాలేజీ స్టూడెంట్‌. తన జూనియర్‌ అయిన నందిని (హన్సిక)ని ప్రేమిస్తాడు. నందిని కూడా చందుని ప్రేమిస్తుంది. అయితే నందిని తండ్రి పెద్దిరెడ్డి (సుమన్‌) ఓ ఫ్యాక్షనిస్టు. ఆయన శత్రువు వీరప్రతాప్‌ (సలీమ్‌ పండా) నందినిని ఓ పెళ్ళి క్యాసెట్‌లో చూసి ప్రేమిస్తాడు. నందినినే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. హైదరాబాద్‌లో ఓ కాలేజీలో చదువుకుంటున్న నందినిని కిడ్నాప్‌ చేసి ఆళ్ళగడ్డలోని తన ఇంటికి తీసుకువస్తాడు. ఆ విషయం తెలుసుకున్న చందు శేఖర్‌గా పేరు మార్చుకుని వీరప్రతాప్‌ ఇంట్లో పనిచేస్తున్న అప్పలరాజు ఎం.ఎ.ఎల్‌.ఎల్‌.బి. (బ్రహ్మానందం) మేనళ్లుడుగా అక్కడికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
సీతారాముల కళ్యాణం (లంకలో) అన్న టైటిల్‌ చూడగానే ఈ సినిమాలో ఖచ్చితంగా కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అంతేకాదు బ్రహ్మానందంని హనుమంతునితో పోల్చుతూ చేసిన పబ్లిసటీ కూడా ఈ చిత్రంలో కామెడీ పాలు ఎక్కువని చెప్పకనే చెబుతాయి. మొత్తానికి టైటిల్‌కి తగ్గట్టుగానే సెకండాఫ్‌లో బ్రహ్మానందం క్యారెక్టర్‌ ఎంటరయిన క్షణం నుండి సినిమా మొత్తం కామెడీతో సాగిపోతోంది.. ప్రస్తుతం పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా హాస్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ చిత్రాలు రావడం ఆహ్వానించదగ్గదే. అయితే ఒకే మూస ధోరణిలో సినిమా కథలు ముందుకు సాగడం విచారకరం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన.....నితిన్‌-: హీరో నితిన్‌ నటన బావుంది. ముఖ్యంగా డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ నితిన్‌ తన మార్కుని కంటిన్యూచేశాడు. కాకపోతే డైలాగ్‌ డెలివరీ విషయంలో మరికొంత సాధన చేయాల్సిందనిపించింది. ఓవరాల్‌గా నితిన్‌ యాక్టింగ్‌ ఆకట్టుకుంటుంది.హన్సిక-: హన్సిక చాలా క్యూట్‌గా ఉంది. కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో చాలా చక్కగా నటించింది. నితిన్‌ సరసన హీరోయిన్‌గా హన్సిక మెప్పించింది.సుమన్‌-: ఓ ఫ్యాక్షనిస్టు నాయకుడిగా మొదటిసారి కనిపించాడు సుమన్‌. రాయలసీమ ఫ్యాక్షనిస్టు పెద్దిరెడ్డి పాత్రలో సుమన్‌ నటన బావుంది. అయితే ఆయన పాత్రని క్లైమాక్స్‌ వరకూ కంటిన్యూ చేసే అవకాశం ఉన్నా ఫస్టాఫ్‌ వరకే పరిమితం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రహ్మానందం-: అప్పలరాజు ఎం.ఎ.ఎల్‌.ఎల్‌.బి. పాత్రలో బ్రహ్మానందం కనిపించి నవ్విస్తాడు. శ్రీలంక దేవుళ్ళుగా ఆలీ, నితిన్‌లు బ్రహ్మానందంతో చేసిన కామెడీ బావుంది. మొత్తానికి సెకండాఫ్‌లో కామెడీని పండించడంలో బ్రహ్మానందం పాత్రదే కీలకం.సుబ్బరాజు-: బుచ్చిబాబు పాత్రలో సుబ్బరాజు హాస్యాన్ని చాలా చక్కగా పండించాడు.. భయంకరమైన విలన్‌ పాత్రలు వేసిన సుబ్బరాజు ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా కనిపించాడు. హాస్యాన్ని కూడా చాలా చక్కగా పండించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నాడు సుబ్బరాజు.జయప్రకాష్‌ రెడ్డి-: రొటీన్‌ ఫ్యాక్షనిస్టు పాత్రలోనే కనిపించినా తనదైన స్టయిల్లో రాయలసీమ మాండలికంలో డైలాగులు చెబుతూ తన పాత్రని చక్కగా చేసాడు.చంద్రమోహన్‌-: హీరో ఫాదర్‌ క్యారెక్టర్‌లో చంద్రమోహన్‌ రొటీన్‌గా కనిపించాడు. ఇలాంటి పాత్రలు ఆయన ఇదివరకే ఎన్నో వేయడంతో జస్ట్‌ రొటీన్‌గా అనిపిస్తుంది.ఎమ్మెస్‌ నారాయణ-: రిస్క్‌ర్యాంబోగా ప్రిన్సిపల్‌ పాత్రలో ఎమ్మెస్‌ నారాయణ తన మార్కు కామెడీని పండించాడు.మిగతా పాత్రలలో మిగతా నటీనటులు తమ పరిధులమేరకు బాగానే చేసారు.సంగీతం-: అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం బావుంది. ముఖ్యంగా "కిస్‌ మి' సాంగ్‌ యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంటుంది.మాటలు-: తోట ప్రసాద్‌, విక్రమ్‌రాజ్‌లు అందించిన మాటలు అక్కడక్కడా బావున్నాయి.కెమెరా-: జోషి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. సాంగ్స్‌ చిత్రీకరణలో కెమెరా పనితనం బావుంది.ఎడిటింగ్‌-: బావుంది.డాన్స్‌-: డాన్స్‌ విషయంలో నితిన్‌ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ చిత్రంలో కూడా డాన్స్‌ కంపోజ్‌ బావుంది. ముఖ్యంగా "కిస్‌ మి' పాటకి ప్రేమ్‌ రక్షిత్‌ కంపోజ్‌ చేసిన డాన్స్‌ ఆకట్టుకుంటుంది.. మిగతా పాటలలో కూడా డాన్స్‌ బావుంది. ఫస్ట్‌ సాంగ్‌లో హీరో నితిన్‌ చేసిన రిస్కీ స్టెప్స్‌ ఆకట్టుకుంటాయి.ఫైట్స్‌-: రామ్‌-- లక్ష్మన్‌లు తమదయిన స్టైయిల్లో యాక్షన్‌ సీన్లని కంపోజ్‌ చేశారు. హీరో నితిన్‌ బాడీ లాంగ్వేజీకి తగ్గట్టుగా ఉన్నాయి ఫైట్స్‌.మొత్తానికి ఈ చిత్రం హీరో నితిన్‌ యాక్టింగ్‌ కోసం, సెకండాఫ్‌లో సాగిపోయే కామెడీ ఎపిసోడ్స్‌ని ఎంజాయ్‌ చేయడం కోసం చూడొచ్చు.