English | Telugu

సినిమా పేరు:శంఖం
బ్యానర్:శ్రీ బాలాజీ సినీమీడియా పతాకం
Rating:2.50
విడుదలయిన తేది:Sep 11, 2009
బ్యానర్:శ్రీ బాలాజీ సినీమీడియా పతాకం
Rating:2.50
విడుదలయిన తేది:Sep 11, 2009
చందు (గోపీచంద్) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తన బ్యాచిలర్ మేనమామ కృష్ణారావు (చంద్రమోహన్)తో కలిసి ఉంటాడు. చందు తండ్రి శివయ్య (సత్యరాజ్) ఉన్నా కూడా చందుకి తన తండ్రి చనిపోయాడని చెబుతాడు కృష్ణారావు. కొట్టుకోవడమంటే చందుకి మహా ఇష్టం కానీ ఛాన్స్ దొరకదు. ఒకసందర్భంలో మహాలక్ష్మి (త్రిష) ఓ వ్యక్తిని చితక్కొట్టడం చూసిన చందు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె తన చిన్నాన్న బుచ్చయ్య (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) దగ్గర ఉంటుంది. మహాలక్ష్మిని ప్రేమలో పడేయడానికి మహాలక్ష్మి ఫ్రెండ్ పెళ్లిని వేదికగా చేసుకోవాలనుకుంటాడు చందు. దానికి గాను పెళ్లి కొడుకు సైఫ్‌అలీఖాన్ (ఆలీ)ని తన ప్రాణస్నేహితుడిగా మలుచుకుంటాడు. చివరికి ఆమెని తన ప్రేమలో పడేసే సమయానికి మహాలక్ష్మి మేనత్త (తెలంగాణ శకుంతల) ఎంటరవుతుంది.. తన కొడుకు ప్రేమ్ (వేణుమాధవ్)తో ఆమె పెళ్లి చేయడానికి మహాలక్ష్మిని ఇండియాకి తీసుకువస్తుంది.అది తెలిసిన చందు కూడా ఇండియాకి వస్తాడు. సీన్ రాయలసీమ ప్రాంతానికి మారుతుంది. మహాలక్ష్మి నాన్న పశుపతి (కోట శ్రీనివాసరావు)కి, శివయ్యకి ఏళ్ళ తరబడి శతృత్వం ఉంటుంది.. తన కూతురు ప్రేమిస్తున్న చందు శివయ్య కొడుకని, శివయ్యే తన తండ్రని చందుకి తెలియదని తెలుసుకున్న పశుపతి చందుని పావుగా వాడుకుని శివయ్యని చంపాలనుకుంటాడు. అయితే శివయ్య తన తండ్రని చందుకి తెలుస్తుంది.. అప్పటి నుండి శివయ్యతో కలిసి ఉన్న చందు పశుపతి కూతురిని ఎలా దక్కించుకున్నాడు, శివయ్య, పశుపతి మధ్యలో ఉన్న శతృత్వానికి ఎవరు బలయ్యారు, అసలు చందు తన తండ్రి శివయ్యకి దూరంగా ఎందుకున్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాలి.