Read more!

English | Telugu

సినిమా పేరు:సంఘర్షణ
బ్యానర్:శ్రీ రంజిత్ మూవీస్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 2, 2011

కథ - ఎక్కడో నిద్రపోతున్న ఇద్దరు పెద్దగా చదువుకోని యువకులు బయటకు పారిపోతూండగా ఒక వ్యక్తి వెంబడిస్తాడు. అతన్నుండి తప్పించుకుని ఈ ఇద్దరూ హైదరాబాద్ వచ్చి తమని తాము నిరూపించుకోటానికి కష్టపడుతూంటారు. వాళ్ళ జీవితాలు ఒక గాటిలో పడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు వీళ్ళని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తారు. వాళ్ళని చూసిన వీళ్ళు పారిపోతారు. అసలు వీళ్ళెవరు...? వీళ్ళ కోసం వచ్చిన వాళ్ళెవరు అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - తమిళ దర్శకుడు సముద్రఖని గతంలో "శంభో శివశంభో" అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతనీ చిత్రానికి చక్కని కథని, స్క్రీన్ ప్లే సమకూర్చినా కథ రెండవ భాగంలో తమిళ వాసన బాగా కొట్టటం, కథలో డ్రైనెస్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ సినిమాలో చక్కని దర్శకత్వపు విలువలున్నా, ఒక మంచి కథని రియలిస్టిక్ గాచూపించే విధానంలో సముద్రఖనిలో ఉన్న విపరీత ధోరణి ఈ సినిమాకి మైనస్ గా మారింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - ఈ సినిమాలో అల్లరి నరేష్ తనకు పిచ్చి పట్టే సీన్లో నటించిన తీరుకి అతనికి కచ్చితంగా ఫిలిం ఫేర్ అవార్డు లభించే అవకాశాలున్నాయి. అంత అద్భుతంగా నరేష్ నటన ఉంది. సినిమా అంతా శశి లీడ్ చేసినా, నరేష్ తనకు లభించిన చిన్న అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగపరచుకుని తనలో ఉన్న నటుణ్ణి జనానికి మరోసారి చూపించటం హర్షణీయం, అభినందనీయం. శశి తన పాత్రలో బాగా నటించాడు. స్వాతి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు అరవస్థాయిలో పూర్తి న్యాయం చేశారు.

సంగీతం - ఎవరో ఇతడెవరో అనే పాట బాగుంది. మిగిలిన పాటలు కూడా ఫరవాలేదు. రీ-రికార్డింగ్ మాత్రం చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా ప్రతి సీన్ కు ఆ సీన్ మూడ్ ఎలివేట్ చేసే విధంగా లైటింగ్ ఉండటం ముదావహం.

మాటలు - బాగున్నాయి.

పాటలు - ఫరవాలేదు.

ఎడిటింగ్ - బాగుంది.

కొరియోగ్రఫీ - మొదటి పాటలో చాలా బాగుంది. ఒక పాటలో కథ నడిపించిన విధానం ఇంకా

బాగుంది.

యాక్షన్ - ఒ.కె.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మీరు సినీ పరిశ్రమకు చెందిన వారైతే ఈ సినిమాని ఓసారి చూడాలి. లేకపోతే మీ ఇష్టం. చూస్తే చూడండి...లేకపోతే లేదు...!