English | Telugu

సినిమా పేరు:సాహ‌సం శ్వాస‌గా సాగిపో
బ్యానర్:ద్వారకా క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 11, 2016

ఎంత గొప్ప ద‌ర్శ‌కుడైనా కావొచ్చు. క‌థ విష‌యంలో అశ్ర‌ద్ద చేస్తే.. అస‌లు దాన్ని ప‌ట్టించుకోక‌పోతే - త‌ప్పులో కాలేయ‌డం త‌ప్ప‌నిస‌రి. గొప్ప టెక్నీషియ‌న్లుగా నిరూపించుకొన్న ద‌ర్శ‌కులు సైతం - ఫ్లాపులు కొడుతున్నారంటే, వాళ్ల సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప‌ల్టీలు కొడుతున్నాయంటే.. దానికి కార‌ణం క‌థ విష‌యంలో పెద్దగా శ్ర‌ద్ద పెట్ట‌క‌పోవ‌డ‌మే. క‌థ‌దేముంది.. కొన్ని స‌న్నివేశాలు చాలు, సినిమాని అల్లేయొచ్చు అనుకొన్న ప్ర‌తీసారీ ఎదురుదెబ్బ‌లు తిన‌డం ఖాయం. గౌత‌మ్ మీన‌న్ గొప్ప టెక్నీషియ‌న్‌. ఆయ‌న ల‌వ్ స్టోరీలు చాలా అందంగా డిజైన్ చేస్తారు. పోలీస్ క‌థ‌లు, యాక్ష‌న్ డ్రామాలు తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న శైలి సెప‌రేట్‌. అలాంటి వాడు కూడా.. ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడంటే ఒక్క‌టే కార‌ణం.. క‌థ‌పై క‌స‌ర‌త్తు చేయ‌క‌పోవ‌డం. గౌత‌మ్ మీన‌న్ నుంచి ఇప్పుడు మ‌రో సినిమా వ‌చ్చింది. అదే సాహ‌సం శ్వాస‌గా సాగిపో. క‌నీసం  ఈ సినిమాలో అయినా `క‌థ‌` అనే విష‌యం ఉందా?  లేటుగా వ‌చ్చిన ఈ సినిమాలో ఆసక్తిక‌ర‌మైన ఎలిమెంట్స్ ఏంటి?  చైతూకి ఈ సినిమా ఏమైనా హెల్ప్ అవుతుందా?  తెలియాలంటే  రివ్యూలోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

మ‌హారాష్ట్రలో ఉంటున్న లీలా స‌త్య‌మూర్తి (మంజిమా మోహ‌న్‌) రైట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటుంది. సినిమాల్లో ట్రై చేద్దామ‌ని వైజాగ్ వ‌స్తుంది. ఇక్క‌డ ఓ స్నేహితురాలి ఇంట్లో ఉంటుంది. అక్క‌డే ర‌జ‌నీకాంత్ (నాగ‌చైత‌న్య‌) ప‌రిచ‌యం అవుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ర‌జ‌నీకి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. లీలాతో లాంగ్ ట్రిప్ వేయాల‌నుకొంటాడు. ఇద్ద‌రూ క‌ల‌సి బైక్‌పై క‌న్యాకుమారి వ‌ర‌కూ వెళ్లి తిరిగొస్తుంటారు. దారిలో అనూహ్య‌మైన సంఘ‌ట‌న జ‌రుగుతుంది. లీలాపై దాడి జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో మ‌హారాష్ట్రలో ఉంటున్న లీలా ఫ్యామిలీపై కూడా అటాక్ జ‌రుగుతుంది. ఇదంతా యాక్సిడెంట‌ల్‌గా జ‌రిగాయా, లేదంటే ఎవ‌రైనా చేశారా?  లీలాని ర‌జ‌నీ ఎలా కాపాడుకొన్నాడు?  అనేదే ఈ సినిమా క‌థ‌.


ఎనాలసిస్ :

ఏమాత్రం బ‌లం లేని ఇలాంటి క‌థ‌తో గౌత‌మ్ మీన‌న్  ఓ సినిమా తీస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు. గౌత‌మ్ సినిమాల్లో క‌థ కంటే.. క‌థ‌నంలో వేగం, పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, ల‌వ్ బ్యాక్ డ్రాప్ ఇవే బ‌లంగా ఉంటాయి. దుర‌దృష్టం కొద్దీ ఈ సినిమాలో అవీ క‌నిపించ‌వు. సినిమా స్లోగా మొద‌ల‌వుతుంది. ఫ‌స్ట్ ఆఫ్ అంతా ల‌వ్ ట్రాకే.  ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా గౌత‌మ్ మీన‌న్ గ‌త సినిమాల్ని గుర్తు చేసేలా ఉంటాయి. పాట‌ల‌న్నీ ఫ‌స్ట్ ఆఫ్‌లోనే వాడేశారు. అవీ బిట్లు బిట్లుగా. దాంతో... మాట‌ల కంటే పాట‌లు ఎక్కువ‌గా వినిపిస్తాయి. రోడ్ జ‌ర్నీలో వ‌చ్చే మాంటేష్ షాట్లూ కొత్త‌గా లేవు. ఇంట్ర‌వెల్ ముందు జ‌రిగే యాక్సిడెంట్‌.. ఆ త‌రవాతి ప‌రిణామాలూ చూసి క‌థ ఇక నుంచైనా ముందుకు వెళ్తుందిలే అనుకొంటాం. కానీ అక్క‌డా నిరాశే ఎదుర‌వుతుంది. సెకండాఫ్ లో సినిమా మ‌రింత దారుణంగా నెమ్మ‌దిస్తుంది. తొలి స‌గం ఓ సినిమా.. సెకండాఫ్ మ‌రో సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంటుంది ప్రేక్ష‌కుల‌కు. ఎందుకంటే ఈ రెండు భాగాల‌కూ అస‌లు సంబంధమే ఉండ‌దు. ఫ‌స్టాఫ్ ల‌వ్ ట్రాక్‌... సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్. ఛేజింగులు, ఫైటింగుల‌తో నింపేశారు. ఇన్వెస్టిగేష‌న్ జ‌రిగే తీరు ఎప్పుడైనా స‌రే, ఇంట్ర‌స్టింగ్ గా ఉండాలి. అదేం.. ఈసినిమాలో క‌నిపించ‌దు. క్లైమాక్స్ మ‌రో 5 నిమిషాల్లో ముగుస్తుంద‌గా.. ఇలా జ‌రిగింది.. అలా జ‌రిగింది అంటూ హీరో చేత డైలాగులు చెప్పిస్తారు. దాంతో చిక్కుముడుల‌న్నీ వీడిపోతాయి. దీని కోస‌మా, ఇంత సేపు ఓపిగ్గా కూర్చున్న‌ది?  అనిపిస్తుంది.  యాక్ష‌న్ స‌న్నివేశాల్ని య‌మ ఆసక్తిగా తెర‌కెక్కించే గౌత‌మ్ మీన‌న్ కూడా ఈ సినిమా విష‌యంలో ఫెయిల్ అయ్యాడు. ఏతా వాతా చూస్తే ఫ‌స్టాఫే కాస్త బెట‌ర్‌గా అనిపిస్తుంది. అది చూసి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే. క‌చ్చితంగా స‌గం త‌ల‌నొప్పితో స‌రిపెట్టుకోవొచ్చు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ప్రేమ‌మ్ మూడ్‌లో ఉన్నారు చైతూ ఫ్యాన్స్‌. వాళ్లంద‌రికీ ఈ సినిమాతో దిమ్మ‌తిర‌గ‌డం ఖాయం. ల‌వ్ స్టోరీకి సంబంధించిన సీన్ల‌లో చైతూ బాగానే చేసినా... యాక్ష‌న్ ఎలిమెంట్స్ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి చైతూ గ‌త లోపాల‌న్నీ మ‌ళ్లీ ఫ్రెష్షుగా బ‌య‌ట‌ప‌డిపోయాయి. సినిమా అంతా ల‌వ్‌స్టోరీ యాంగిల్‌లో న‌డిచినా... ఏదో యావ‌రేజ్‌గా ఈ సినిమా గ‌ట్టెక్కేద్దును. యాక్ష‌న్ సినిమాలు చేయ‌డానికి చైతూ ఇంకా బాగా స‌న్న‌ద్దం కావాల్సివుంది. మంజిమా మోహ‌న్ ఒక్కో సీన్‌లో ఒక్కోలా క‌నిపించింది. యాక్టింగ్ ఫ‌ర్వాలేదు. విల‌న్ పాత్ర‌లో తొలిసారి క‌నిపించిన బాబా సెహ‌గ‌ల్ న‌ట‌న కూడా అంతంత మాత్రంగానే ఉంది. విల‌న్ పాత్ర‌లో బ‌లం లేక‌పోయినా.. ఓ స‌రికొత్త విల‌న్‌నిచూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. మిగిలిన వాళ్లంతా.. య‌థా పాత్ర - త‌థా న‌ట‌న‌.


* సాంకేతిక వ‌ర్గం

ఈ సినిమా మొత్తానికి క‌ర్త క‌ర్మ క్రియ గౌత‌మ్ మీన‌న్‌. ఆయ‌న యాంగిల్లోంచి చూస్తే... గౌత‌మ్ నుంచి రావాల్సిన సినిమా కాదిది. క‌థ‌, పాత్ర‌ల విష‌యంలో ఆయ‌న క‌స‌ర‌త్తులేం చేయ‌లేద‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మైపోతోంది. ఏ సీన్ కూడా క‌న్వెన్సింగ్ గా లేదు. సెకండాఫ్‌లో స్టోరీ నేరేష‌న్ బాగా బోర్ కొట్టింది. రెహ‌మాన్ పాట‌ల్నీ ఫ‌స్టాఫ్‌లో వాడేశారు. అందులో కొన్ని మిస్ టైమింగ్ అయ్యాయి. తానూ నేను... పాట మాత్రం మెలోడీ ల‌వ‌ర్స్‌కి బాగా న‌చ్చుతుంది. ఎడిట‌ర్‌కి స్వేచ్ఛ ఇచ్చుంటే.. స‌గం సినిమా లేపేసేవాడు. మాట‌లు అక్కడ‌క్క‌డా మెరిశాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైన‌ల్ ట‌చ్ :  సాహ‌సం శ్వాస‌గా సినిమా చూడాలంటే... అదో పేద్ద సాహ‌సం అనుకోవాల్సిందే.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25