English | Telugu

సినిమా పేరు:సారాయి వీర్రాజు
బ్యానర్:విశాలాక్షి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ .
Rating:2.00
విడుదలయిన తేది:Dec 4, 2009
నర్సీపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సారాయి వీర్రాజు (అజయ్‌), ధనలక్ష్మి (రమ్య నంబీశన్‌) చిన్ననాటి స్నేహితులు. ధనార్జన కోసం వీరు సారా వ్యాపారం వృత్తిగా చేపడతారు. వీర్రాజు ఆ గ్రామంలో ఆకతాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు తారసపడతారు. ఆ ముగ్గురితో చేతులు కలుపుతాడు వీర్రాజు. కొంతకాలం సజావుగా సాగిపోతుంది. ఇంతలో వీర్రాజు స్నేహితులు నకిలీ పథకం తమ జీవితాలను మారుస్తుందని గుడ్డిగా నమ్మిన గ్రామస్తులు ఆ పథకంలో చేరతారు. కొద్దికాలం తర్వాత బోర్డ్‌ తిప్పేస్తారు ఆ ముగ్గురూ. దీనితో తమ కలలు కల్లలైనాయని భావించి, తట్టుకోలేని కొందరు గ్రామస్తులు ఆత్మహత్యకు పాల్పడతారు. ఇది చూసి ధనలక్ష్మి పోలీసుల సహాయంతో మోసగాళ్ళ వద్దకు వెడుతుంది. అక్కడ మోసాగాళ్ళతో చేతులు కలిపిన పోలీసు అధికారి ధనలక్ష్మిపై సామూహిక అత్యాచారానికి పాల్పడతాడు. అత్యాచారానికి గురైన ధనలక్ష్మి మరణిస్తుంది. ధనలక్ష్మి మృతికి, గ్రామస్తుల ఆత్మహత్యలకు కారకులైన వారి ఆచూకీ కోసం వీర్రాజు ప్రయత్నించగా, వారు దుబాయ్‌లో ఉన్నారని తెలుస్తుంది. వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దుబాయ్‌ పయనమవుతాడు వీర్రాజు. ఈ ప్రయాణంలో ప్రీతి (మధులిక) అనే యువతి పరిచయమవుతుంది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ప్రీతి ప్రేమ పెళ్ళిదాక వెళ్ళిందా లేదా? దుబాయ్‌ వెళ్ళిన వీర్రాజు ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ.
ఎనాలసిస్ :
చిత్రం ఎక్కువ భాగం ఫ్లాష్‌ బ్యాక్‌లో సాగుతుంది. ప్రధమార్థం సమకాలీన సంఘటనలకు అద్దం పట్టే రీతిలో సాగినప్పటికీ, కథనం చెప్పుకోదగినంత వేగంగా సాగక, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ద్వితీయార్థం ఒక మోస్తరుగా ఉంటుంది. కథానాయకుడుగా అజయ్‌ నటన చక్కగానే వుంటుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: గతంలో కొద్ది సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న అజయ్‌, తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. ధనలక్ష్మి పాత్రలో నటించిన రమ్య నింబీశన్‌, మరో ప్రధాన పాత్రలో నటించిన మధులిక ఈ చిత్రానికి ఆకర్షణీయంగా ఉంటారు. కమెడియన్‌గా ధన్‌రాజ్‌ నటన పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద ఇదొక టైం పాస్‌ చిత్రం అని చెప్పుకోవాలి. సంగీతం-: ఈ చిత్రంలోని "నీలో.. నాలో...'' అనే పాట చక్కని మెలోడీతో సాగుతుంది. దర్శకత్వం-: కణ్ణన్‌ దర్శకత్వం బాగానే వుంది. ఎడిటింగ్-: ఓ.కే. కెమెరా-: విశ్వ కెమెర పనీతీరు బాగుంది. ఈ చిత్రం మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ అనే తేడాలు లేకుండా అన్ని వర్గాలు వారు చూసే విధంగా చాలా నీట్‌గా వుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25