Read more!

English | Telugu

సినిమా పేరు:రూల్స్‌ రంజన్‌
బ్యానర్:స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
Rating:2.75
విడుదలయిన తేది:Oct 6, 2023

సినిమా పేరు: రూల్స్‌ రంజన్‌
తారాగణం: కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్‌ చాహల్‌, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్‌, అజయ్‌, అతుల్‌ పర్చురే, విజయ్‌ పాట్కర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్‌, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్‌, సిద్ధార్థ్‌ సేన్‌
సంగీతం: అమ్రిష్‌ గణేష్‌
ఎడిటర్‌: వరప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: దులీప్‌ కుమార్‌
రచన, దర్శకత్వం: రత్నంకృష్ణ
నిర్మాతలు: దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి
బ్యానర్‌: స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 6, 2023 
సాధారణంగా కొంతమంది దర్శకులు ట్రెండ్‌ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తారు. అంటే ప్రజెంట్‌గా ఏ జోనర్‌ సినిమాలను ఆడియన్స్‌ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేది గమనించి దానికి తగ్గట్టుగా సినిమా తీసే ప్రయత్నం చేస్తారు. కానీ, కొంతమంది దర్శకులకు ట్రెండ్‌తో పనిలేదు. తను ఏదైతే అనుకున్నాడో దాన్నే తెరపై ఆవిష్కరిస్తారు. అయితే కామెడీ జోనర్‌కి మాత్రం ట్రెండ్‌ అనేది వర్తించదు. చక్కని కామెడీతో చేసిన సినిమాలు ఏ సీజన్‌లో అయినా సక్సెస్‌ అవుతాయి. ఈ పాయింట్‌ని అర్థం చేసుకున్న రత్నం కృష్ణ.. ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాన్ని కామెడీ జోనర్‌లోనే తెరకెక్కించాడు. కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ : 

మనోరంజన్‌ (కిరణ్‌ అబ్బవరం) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. లైఫ్‌లో ఎంతో సాధించాలనే పట్టుదల వున్న రంజన్‌ అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. అయితే అనుకోకుండా అతనికి ముంబై ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. బాలీవుడ్‌కి క్యాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసే వెన్నెల కిషోర్‌ పరిచయం అవుతాడు. రంజన్‌ అతని రూమ్‌లోనే ఉంటూ వుంటాడు. అక్కడే తన చిన్ననాటి స్నేహితురాలైన సన(నేహాశెట్టి) పరిచయం అవుతుంది. ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు రంజన్‌. ఆమెకు క్లోజ్‌ అవ్వడం కోసం తన రూల్స్‌ని బ్రేక్‌ చేసి పబ్బులకు కూడా వెళ్తాడు. కానీ, అప్పటికే సనకు పెళ్ళి ఫిక్స్‌ అయిందని తెలుసుకొని షాక్‌ అవుతాడు. మరి అలాంటి సిట్యుయేషన్‌లో అతను షాక్‌ నుంచి బయటికి వచ్చాడా? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి సనను రంజన్‌ పెళ్ళి చేసుకున్నాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎనాలసిస్ :

డైరెక్టర్‌ ఎంచుకున్న కథ యూత్‌కి బాగానే కనెక్ట్‌ అవుతుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు నవ్విస్తూనే ఉండాలి అనే కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఓ పక్క హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ సీన్స్‌ నడుస్తూనే వుంటాయి. మరో పక్క కామెడీ దాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్తుంది. ఈ రెండిరటినీ బ్యాలెన్స్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. హైపర్‌ ఆది, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష వంటి ఆర్టిస్టులతో చక్కని కామెడీ వర్కవుట్‌ అయ్యింది. రెగ్యులర్‌గా వచ్చే కామెడీ కంటే కాస్త డిఫరెంట్‌గా ఈ సినిమాని హ్యాండిల్‌ చెయ్యాలని చూశాడు దర్శకుడు. ఆర్టిస్టుల నుంచి చక్కని పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నాడు. 

నటీనటులు :

రంజన్‌గా నటించిన కిరణ్‌ అబ్బవరం పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. అతని గత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బెటర్‌గా ఉంది. నేహాశెట్టి ప్రజెన్స్‌ కూడా బాగుంది. ముఖ్యంగా లవ్‌ సీన్స్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఇక సినిమాలో హైలైట్‌గా చెప్పుకోదగ్గ క్యారెక్టర్‌ వెన్నెల కిషోర్‌ చేశాడు. అతను చేసిన కామెడీ హండ్రెడ్‌ పర్సెంట్‌ పండిరది. హైపర్‌ ఆది, వైవ హర్ష కామెడీ కూడా బాగా వర్కవుట్‌ అయ్యింది.  మిగతా క్యారెక్టర్స్‌ చేసిన నటీనటులు వారి క్యారెక్టర్లకు న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణులు :

అమ్రిష్‌ గణేష్‌ అందించిన సంగీతం బాగుంది. పాటలు ఇప్పటికే హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘సమ్మోహనుడా...’ సాంగ్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. దులీప్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. వరప్రసాద్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. స్టార్‌ నైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఇక డైరెక్టర్‌ రత్నం కృష్ణ గురించి చెప్పాలంటే కథ పాతదే అయినా దాన్ని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడు. అతని కెరీర్‌లో ఈ సినిమాకి ఎక్కువ మార్కులు పడతాయి. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పెళ్ళి ఫిక్స్‌ అయిపోయిన అమ్మాయిని ప్రేమించి ఆమెను ఇబ్బంది పెడుతూ వుండే హీరో క్యారెక్టర్‌. దాని వల్ల అతను ఎదుర్కొనే ఇబ్బందులు. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలా సినిమాల్లో చూశాం. ఈ రొటీన్‌ కథను ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తీర్చిదిద్దడంలో రత్నం కృష్ణ సక్సెస్‌ అయ్యాడు. స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండిరగ్‌ వరకు ఎక్కడా బోర్‌ అనేది లేకుండా కథను నడిపించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే రూల్స్‌ రంజన్‌ అందర్నీ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతాడు. 

- జి.హరా