English | Telugu

సినిమా పేరు:రొమాంటిక్
బ్యానర్:పూరి కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:Oct 29, 2021

తారాగణం: ఆకాష్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్ తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్ధిక్
పాటలు: భాస్కరభట్ల, పూరి జగన్నాథ్
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పూరి జగన్నాథ్ 
దర్శకత్వం: అనిల్ పాదూరి
విడుదల: 29 అక్టోబర్ 2022

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి హీరోలతో దర్శకుడు పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ హిట్లు తీశారు. ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. రామ్ చరణ్ ను 'చిరుత'తో హీరోగా పరిచయం చేశారు. అయితే, 'మెహబూబా'తో కుమారుడు ఆకాశ్ పూరికి హిట్ ఇవ్వలేకపోయారు. ఈసారి దర్శకుడిగా కాకుండా... కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఇచ్చి కుమారుడితో 'రొమాంటిక్' తీశారు. పూరి మార్క్ గ్యాంగ్‌స్ట‌ర్‌ జాన‌ర్‌లో రొమాన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
 
కథ:- వాస్కొడిగామా (ఆకాశ్ పూరి) తండ్రి నిజాయతీ గల పోలీస్. ఓ చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది దుండగులు వాస్కొడిగామా తండ్రి, తల్లిని కాల్చి చంపేస్తారు. దాంతో అతడిని నానమ్మ మేరీ (రమాప్రభ) పెంచుతుంది. పెద్దయిన తర్వాత వాస్కోడిగమా గ్యాంగ్‌స్ట‌ర్‌ అవుతాడు. గోవాలో శాంసంగ్ (మకరంద్ దేశ్ పాండే) ఆపోజిట్ గ్యాంగ్ రోడ్రిగజ్‌ దగ్గర చేరుతాడు. వాస్కో ఇచ్చిన ఓ ఐడియాతో కోట్ల రూపాయల మాల్ వీళ్ల దగ్గరకు చేరుతుంది. తనకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వడానికి రోడ్రిగజ్‌ ఇష్టపడడు. అప్పుడు జరిగిన గొడవలో రోడ్రిగజ్‌ మరణిస్తాడు. తర్వాత మాల్ అంతా గ్యాంగ్ సభ్యులు పంచుకుంటారు. ఆ తర్వాత ఏం చేశారు? తన మాల్ కొట్టేసిన సంగతి తెలిసి శాంసంగ్ ఏం చేశాడు? వాస్కోను రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ) ఎందుకు టార్గెట్ చేసింది? మధ్యలో మౌనిక (కేతికా శర్మ)తో వాస్కొడిగామా ప్రేమకథ ఏంటి? ఇద్దరి మధ్య ఎఫైర్ స్టార్ అయ్యే రోజు పోలీసులు ఎందుకొచ్చారు? మేరీ ఫౌండేషన్ ఏంటి? అనేది మిగతా సినిమా.


ఎనాలసిస్ :

 'రొమాంటిక్' దర్శకుడు అనిల్ పాదూరి అయినా... స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ రాయడం వల్ల ఏమో? సినిమా అంతా పూరి జగన్నాథ్ మార్క్ కనపడుతుంది. సినిమా చూస్తున్న అంతసేపూ పూరి గత సినిమాలు గుర్తుకు వస్తాయి. అనిల్ పాదూరి కూడా పూరి సినిమాలా తీశాడు. మాఫియా గ్యాంగ్ లు... వాటిలోకి కొత్తగా వచ్చిన ఓ కుర్రాడు... గ్యాంగ్ స్టర్ గా ఎదగడం... రెగ్యులర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపించే సీన్లు ఎక్కువ. కొత్తగా ఏమీ లేదు. వాటిని గ్రిప్పింగ్ గా తీయడం లో ఫెయిల్ అయ్యారు. సునీల్ కశ్యప్ పాటలు సినిమా వరకు బాగున్నాయి. థియేటర్ నుండి బయటకు వచ్చాక గుర్తుపెట్టుకుని పాటలు లేవు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు. మాఫియా జోనర్ నుండి పూరి బయటకు వస్తే... బాగుంటుందనిపిస్తుంది.


నటీనటుల పనితీరు:- ఆకాష్ పూరి బాగా చేశాడు. అతడి నటనలో ఈజ్ ఉంది. అయితే... అతడి వయసుకు మించిన పాత్రలో యాక్ట్ చేశాడని అనిపిస్తుంది. 'పీనే కే బాద్...' పాటలో తాగినట్లు యాక్ట్ చేయడంలో ఇంకా పరిణితితో చేయాల్సింది. అదే పాటలో రామ్, పూరి జగన్నాథ్ కనిపించారు. క్లైమాక్స్ లో ఆకాష్ పూరి నటన కంటతడి పెట్టిస్తుంది. కేతికా శర్మలో నటన తక్కువ. జస్ట్ గ్లామర్ డాల్. దర్శకుడు కూడా ఆమె టాప్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. రమ్యకృష్ణ పోలీస్ గా నటించడం వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. ఉత్తేజ్ ఎప్పటిలా బాగా చేశాడు. మిగతా క్యారెక్టర్లలో నటించిన వాళ్లందరూ పాత్రలకు తగ్గట్టు చేశారు. 
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పూరి జగన్నాథ్ మార్క్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. పక్కా పూరి అభిమానుల కోసమే! పాటల్లో, ట్రైలర్లలో చూపించిన రొమాన్స్ కంటే... సినిమాలో ఫైట్స్, గ్యాంగ్ స్టర్ డ్రామా ఎక్కువ ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా... పూరి సినిమా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే వెళ్లండి. పక్కా పూరి జగన్నాథ్ మార్క్ కమర్షియల్ గ్యాంగ్ స్టర్ సినిమా ఇది.

- వనమాలి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25