Read more!

English | Telugu

సినిమా పేరు:రామ రామ కృష్ణ కృష్ణ
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:May 12, 2010
అశోక్ దేవా (అర్జున్) ముంబై డాన్. తన ప్రత్యర్థి అయిన పవార్ అశోక్ దేవా భార్య గౌతమి ని (గ్రేసి సింగ్)ని చంపేస్తారు. తన భార్య చివరి కోరిక, తన ఇద్దరు చెల్లెళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మామూలు జీవితం గడపాలనుకుని ముంబై నుండి ఈస్ట్ గోదావరి లోని గాంధీపురం కి అశోక్ షిఫ్ట్ అవుతాడు. అయితే ముంబై లో తన శత్రువు అయిన పవార్ కి తను చనిపోయినట్లు నమ్మిస్తాడు. గాంధీ పురం సర్పంచ్ చక్రపాణి (నాజర్) కొడుకు రామకృష్ణ (రామ్). డాక్టర్ చదివే రామకృష్ణ అన్నయ్య, అశోక్ దేవా పెద్ద చెల్లెలు ఇద్దరూ ప్రేమలో పడతారు. అశోక్ అంటే సదభిప్రాయం లేని తన తండ్రి చక్రపాణి తమ పెళ్లిని జరిపించడని, చక్రపాణి పెద్ద కొడుకు, అశోక్ పెద్ద చెల్లెలు ఇద్దరు కలిసి ముంబై లేచిపోతారు. వారి ప్రేమ గురించి తెలిసిన రామకృష్ణ, అశోక్ చిన్న చెల్లెలు (ప్రియ ఆనంద్), వారు ఎక్కడున్నారో తెలుసుకుని ముంబై బయలు దేరుతారు. ఆ క్రమంలో పవార్ కొడుకు దృష్టిలో వారు పడతారు. అశోక్ తాలూకు మనుషులని తెలుసుకున్న పవార్ మనుషులు రామకృష్ణ బృందం పైన ఎటాక్ చేస్తారు. పవార్ చేతిలోనుండి తమ వారిని రక్షించడం కోసం రామకృష్ణ చేసిన పోరాటంలో పవార్ కొడుకు చనిపోతాడు. ఆ చనిపోయిన పవార్ కొడుకుని అడ్డం పెట్టుకునే రామకృష్ణ గ్యాంగ్ బయట పడుతుంది. చివరికి రామకృష్ణ తన అన్నయ్య పెళ్లిని అశోక్ పెద్ద చెల్లెలితో ఎలా చేయించాడు.. తన కొడుకుని చంపినందుకి పవార్ రామకృష్ణ పై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి అశోక్ చేతిలో ఎలా అంతమొందాడు అన్నది తెలుసు కోవాలంటే.. సినిమా చూడాల్సిందే..
ఎనాలసిస్ :
ఒక సినిమా చూస్తుంటే ఆ సినిమానే చూస్తున్నట్టు ప్రేక్షకులు ఫీలయితే ఆ సినిమా సూపర్ హిట్ కిందికి వస్తుంది. కానీ ఒక సినిమా చూస్తుంటే ఆల్రెడీ చుసిన ఓ నాలుగు సినిమాలు చూస్తున్న అనుభూతి కలిగితే.. అది కచ్చితంగా దర్శక నిర్మాతల పొరపాటే అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే ఒక భాషా, రెడీ, మగదీరా, లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కథలో కొత్తదనం లేకపోతె కనీసం కథనం లోనైనా కొత్తదనం చూపించాలి. కాని ఈ చిత్రం లో ఆ రెండు కొర వడినాయి. కథా, కథా గమనాన్ని సరైన పంథాలో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రామ్ నటన బావుంది, అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. ఆక్టింగ్ కూడా ఓకే. ప్రియ ఆనంద్ ఓకే, బిందు మాధవి కారెక్టర్ జస్ట్ ఆవరేజ్. మిగతా నటీ నటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.ఎం.ఎం. కీరవాణి సంగీతం బావుంది.పల్లె వాతావరణం లో చిత్రీకరించిన సంక్రాంతి సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు ఫర్వాలేదు.ఎం. రత్నం మాటలు బావున్నాయి. రామ్ చెప్పే డైలాగ్ 'చేయి కలిపితే చచ్చే వరకు వదలను, చాయి కదిపితే చంపే వరకు వదలను' లాంటి డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. కథ, కథనం, దర్శకత్వం వహించిన శ్రీవాస్ ఈ మూడింటి మీద మరి కొంత శ్రద్ధ వహిస్తే బావుండేదేమో అని అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ సినిమా టైటిల్ లో దిల్ వేయించుకోలేదు.. ఎందుకనో..? ఓవరాల్ జస్ట్ యావరేజ్ సినిమాగానే ఈ సినిమా వుంటుంది.