English | Telugu

సినిమా పేరు:రాజు మహారాజు
బ్యానర్:శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jun 18, 2009
బ్యానర్:శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jun 18, 2009
అపరకోటీశ్వరుడు చక్రవర్తి (మోహన్‌బాబు) తమ్ముడు కళ్యాణ్ (శర్వానంద్) బాధ్యతలు లేకుండా, కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వకుండా తిరుగుతుంటాడు.అతనికి వెయిటింగ్ అంటే అస్సలు పడదు. అతన్ని బిందు అనే అమ్మాయి ప్రేమిస్తుంటుంది. కానీ తన ప్రేమను కళ్యాణ్‍కి చెప్పదు. కానీ కళ్యాణ్ మరో అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నానని చెపుతాడు. కానీ ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరిస్తుంది. దాంతో పరీక్షల్లో పాసయిన ఆమెను కళ్యాణ్ తప్పేలా చేస్తాడు.ఆమె ధ్యాసలో పిచ్చి వాడవుతాడేమోనని అతని వదిన (రమ్యకృష్ణ) కళ్యాణ్‍తో ఓ పది రోజులు స్నేహంగా ఉండమని ఆమెను రిక్వెస్ట్ చేస్తుంది.దానికామె ఒప్పుకుని అలాగే ఉండగా, ఒకరోజు తన ప్రియురాలిని కలవటానికి జీప్‌లో వేగంగా వస్తున్న కళ్యాణ్ అడ్డం వచ్చిన ఒకతన్ని గుద్దేసి వస్తాడు.ఆ యాక్సిడెంట్‍లో అతను చనిపోతాడు. అతను తను ప్రేమించిన అమ్మాయి తండ్రి (నాజర్). దాంతో ఆ అమ్మాయి కళ్యాణ్ మీద కేసు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో పెట్టిస్తుంది. చక్రవర్తి వచ్చి తన తమ్ముణ్ణి కాపాడమని ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు. దానికామె మీ ఆస్తంతా నాకు వ్రాసిస్తే కేసు వాపసుతీసుకుంటానంటుంది. చక్రవర్తి అలాగే చేసి తమ్ముణ్ణి బయటకు తెస్తాడు. అప్పటి నుంచీ కళ్యాణ్‍కి లోకం అంటే బంధాలంటే ఏమిటో అర్థమవుతుంది. అతను ఒక ఉద్యోగం సంపాదించి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటే అక్కడ కొందరు అమ్మాయిలు అతను మమ్మల్ని ఏడిపిస్తున్నాడని అతని ఉద్యోగం పోయేలా చేస్తారు. దానికి కారణం కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయి. ఒకసారి ఒక టెండరు తమకే వచ్చిందన్న సంతోషకరమైన వార్తను తన తమ్ముడికి చెప్పాలని అతని ఆఫీసుకి వెళ్ళగా అతన్ని తీసేశారని తెలుసుకున్న చక్రవర్తి బస్సెక్కి కుప్పకూలిపోతాడు. ఆ బస్సుకి కండక్టరుగా కళ్యాణ్ పనిచేస్తుంటాడు.అన్న హాస్పిటల్లో ఉన్నాడని వదినకు తెలిస్తే ఆమె ఎక్కడ బాధపడుతుందోనని ఆమెకు చెప్పకుండా ఆ విషయం దాస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయి ఆ విషయాన్ని కళ్యాణ్ వదినకు చెపుతుంది. దాంతో ఆమె హాస్పిటల్‍కి వెళ్ళి అక్కడ కనపడిన కళ్యాణ్‍ని చెంపలు పగలకొడుతుంది. అన్నయ్యను కాపాడే బాధ్యత నాది వదినా అని కళ్యాణ్ వదినకు మాటిస్తాడు. కానీ చక్రవర్తి ఆపరేషన్‌కి కావలసిన డబ్బుని కళ్యాణ్‍కి దొరకకుండా అతని ప్రియురాలు నానా బాధలూ పెడుతుంది. చివరికి తన కిడ్నీ అమ్మి తన అన్నను కాపాడదామనుకుంటే అన్నయ్య ప్రత్యర్థులు ఆ డబ్బిచ్చే మనిషిని దాచేస్తారు. కళ్యాణ్ తన అన్నను ఎలా కాపాడుకున్నాడు...? అతని ప్రియురాలు ఎందుకు అతని మీద పగబట్టినట్టు ప్రవర్తించింది...? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ చిత్రం సకుటుంబ సమేతంగా చూడాలి.