Read more!

English | Telugu

సినిమా పేరు:రైయిన్ బొ
బ్యానర్:శ్రీ సిద్దర్ధ మూవీస్ & భారత్ క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Oct 2, 2008
ఇదొక (సానుభూతి) ప్రేమ కథ. శ్యామ్‌ (రాహుల్‌) ఒక పెయింటర్‌. అతని పక్క ఇంటిలో ఉండే కమల (సింధూ మీనన్‌) అతనికి మంచి స్నేహితురాలు. వీరి స్నేహం ఇలా ఉండగా, అక్కడికి సినిమాల్లో హీరోయిన్‌ అవ్వాలనే బలమైన కోరికతో స్వప్న (సోనాలి చౌహాన్‌) అనే అమ్మాయి వస్తుంది. ఆమె లక్ష్యసాధనలో ఆమెకు శ్యామ్‌ సహాయం చేస్తానంటాడు. స్వప్నకు తన ప్రేమ గురించి చెప్పకుండా మొదటి నుంచీ ఆమెను ప్రేమిస్తున్న శ్యామ్‌కి, ఒక నిర్మాత స్వప్నకు అవకాశమిస్తానని చెప్పి ఆమెను వాడుకోబోతే, అతన్ని అడ్డుకోబోయిన శ్యామ్‌కి, అక్కడ తలకు తగిలిన దెబ్బవలన అతని కళ్ళకు రంగులను గుర్తించే శక్తి పోతుంది. అంటే అతనికి లోకంలో రంగులేవీ కనపడవు. ఒక్క నలుపు, తెలుపు రంగులను మాత్రమే అతని కళ్ళు గుర్తించ గలుగుతాయి. అలాంటి శ్యామ్‌ సహాయంతో స్వప్నకు తెలుగులో యువ అగ్ర దర్శకుడిగా వెలుగుతున్న యస్‌.యస్‌. రాజమౌళి దర్శకత్వంలో నటించే సువర్ణావకాశం లభిస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్వప్న స్టార్‌ డమ్‌ని సొంతం చేసుకుని, అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతుంది. అలా ఎదిగిన స్వప్నకు తన ప్రేమను శ్యామ్‌ వ్యక్త పరిస్తే ఆ ప్రేమనామె తిరస్కరిస్తుంది. శ్యామ్‌ ప్రేమను స్వప్న ఎందుకు తిరస్కరించింది...? శ్యామ్‌తో అవసరం తీరాక అతన్ని ెక్కచేయకుండా పట్టించుకోని ఆమె అవకాశవాదా..? శ్యామ్‌ తన ప్రేమను సఫలం చేసుకున్నాడా...? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చుడాల్సిందే.
ఎనాలసిస్ :
విభిన్నంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రేమ కథ. కథ కొత్తగా వుంది. వి.యన్‌. ఆదిత్య ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు గనక వీలయినంత బాగా ఈ చిత్రాన్ని తీయటానికి ప్రయత్నించాడు. స్ర్కీన్‌ప్లే బాగుంది. ఆదిత్య దర్శకత్వం గురించి కొత్తగా చెప్పే దేముంది. "మనసంతా నువ్వే, నేనున్నాను'' వంటి చిత్రాలు అతనెలాంటి దర్శకుడో చెప్పాయి. నిర్మాణపు విలువలు ఫరవాలేదు. ఈ సినిమాలో గతంలో వచ్చిన వర్మ చిత్రం "రంగీలా", కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన "స్వర్ణ కమలం'' చిత్రాలు పోలకలు కొంచెం కనిపిస్తాయి. ఈ చిత్రంలో "హ్యాపీడేస్‌' ఫేం రాహుల్‌ హీరోగా ప్రేక్షకుల సానుభూతిని సంపాదిస్తాడు. సింధూ మీనన్‌, సోనాలి చౌహాన్‌లు గ్లామర్‌తో పాటు నటించటానికి అవకాశమున్న పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. సునీల్‌, శివారెడ్డిల కామెడీ మనల్ని నవ్విస్తుంది. సునీల్‌ బచ్చన్‌గా సునీల్‌, స్కూల్‌ మాస్టర్గా రకరకాల హీరోయిన్లను అనుకరిస్తూ శివారెడ్డి ప్రేక్షకులకు వినోదాల విందు చేశారు. మాస్టర్‌ బరత్‌ కామెడీ కొంచెం సాగతీసినట్టుగా అనిపించింది. ఇక పరుచూరి వెంకటేశ్వర రావు, యమ్‌.యస్‌. నారాయణ, గొల్లపూడి తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, రాజమౌళి, శ్రీను వైట్ల, సముద్ర వంటి ప్రముఖ దర్శకులు తమ నిజ జీవితంలోని పాత్రను ఈ చిత్రంలో పోషించటం విశేషం. సంగీతం :- గాయకుడు నిహాల్‌ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. ఈ చిత్రంలో సంగీతం అద్భుతంగా లేకపోయినా, ఛండాలంగా మాత్రం లేదు. పాటలన్నీ కాస్తో కూస్తో వినసొంపుగానే ఉన్నాయి. రీ-రికార్డింగ్‌ ఫరవాలేదు. సినిమాటోగ్రఫి :- ఈ చిత్రంలో కేమెరా ఫరవాలేదనిపిస్తుంది. ఉన్న వనరులతోనే సినిమాని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు కెమెరామేన్‌. మాటలు :- మూడువందల పై చిలుకు చిత్రాలకు మాటలనందించినా, తమ కలంలో పదునింకా తగ్గటేదంటున్నారు పరుచూరి సోదరులు. వారి ముద్ర ఈ చిత్రంలోని మాటల్లో అక్కడక్కడా ట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎడిటింగ్‌ :- బాగుంది.ఆర్ట్‌ :- ఆనందసాయి గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అతనేంటో అందరికి తెలిసిందే.ఈ సినిమా ఫరవాలేదు ఓ సారి చూడొచ్చు.. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులెంతవరకూ ఆదరిస్తారనేదానిపైనే ఈ చిత్రం విజయం ఆధారపడి వుంది.