English | Telugu
బ్యానర్:సన్ పిక్చర్స్
Rating:3.00
విడుదలయిన తేది:Jul 26, 2024
సినిమా పేరు: రాయన్
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, కాళిదాస్ జయరాం, దుషరా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు
సంగీతం: ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటర్: ప్రసన్న జి.కే
రచన, దర్శకత్వం: ధనుష్
నిర్మాత: కళానిది మారన్
బ్యానర్:సన్ పిక్చర్స్
విడుదల తేదీ: జూలై 26 , 2024
ఎన్నో అంచనాలతో వచ్చిన కెప్టెన్ మిల్లర్ నిరాశపరచడంతో ధనుష్ (danush)అభిమానులు ఈ రోజు విడుదలైన రాయన్(raayan)మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇందుకు తెలుగు ప్రేక్షకులు మినహాయింపు ఏం కాదు. పైగా ధనుష్ 50వ మూవీ.
మరి ఎలా ఉందో చూద్దాం.
కథ:
రాయన్(ధనుష్ ) చిన్న తనంలోనే తన తమ్ముళ్లు (సందీప్ కిషన్ అండ్ ,కాళిదాస్ జయరాం) చెల్లెలి కోసం (దుషరా విజయన్) ఒక హత్య చేస్తాడు. ఆ తర్వాత ఒక ఏరియాకి వచ్చి ఫుడ్ స్టాల్ బండి పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటాడు.అదే ఏరియాలో ఏ జె సూర్య అండ్ శరవణన్ లు రెండు కరుడు గట్టిన ముఠాలకి నాయకత్వం వహిస్తుంటారు. ఒకరి మనుషులని ఒకరు చంపుకున్న పాత పగలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరవణన్, అతని కొడుకు దారుణ హత్య కి గురవుతారు.ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ తన తండ్రిని చంపిన అదే ఏరియా మీద పగతో ఉంటాడు. ఈ క్రమంలో రాయన్ తో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ. అసలు రాయన్ తోనే డీల్ ఎందుకు కుదుర్చుకున్నాడనేదే ట్విస్ట్
ఎనాలసిస్ :
ముందుగా ఇలాంటి కథని ఎంచుకున్నందుకు రాసినందుకు ధనుష్ కి హాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇప్పుడు భారీ హీరో సినిమా అంటే బోలెడంత డబ్బుని కుమ్మరించాలి. పైగా అందులో ముప్పావంతు గ్రాఫిక్స్ కే ఖర్చు చెయ్యాల్సిన పరిస్థితి. అలాంటివేం అక్కర్లేదని సగటు మనిషికి ఉన్న మెదడే కథ ని పకడ్బందీగా తీసుకెళ్తుందని నిరూపించాడు. ఫస్ట్ ఆఫ్ ని చూసుకుంటే కథ ని స్టార్ట్ చెయ్యడమే ఒక సెంటిమెంట్ అండ్ హత్య తో చూపించి కథ ఎలా ఉండబోతుందో చెప్పేసారు. ఆ తర్వాత ధనుష్ పాత్ర తీరుని, ఆలోచన విధానాన్ని సగటు మనిషి తీరుగానే చూపించారు. తమ్ముళ్లు, చెల్లెలు మీద ప్రేమని చూపించాలంటే నాలుగైదు సెంటిమెంట్ డైలాగులు చెప్పకుండా వాళ్ళ మంచి గురించి ఆలోచించడం బాగుంది. .సందీప్ కిషన్ క్యారక్టర్ కూడా బాగానే పేలింది. బస్తీలో అల్లర చిల్లరగా తిరిగే వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఉంది. సూర్య లవర్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ కూడా చాలా బాగుంది. ఎస్ జె సూర్య క్యారక్టర్ తీరుతెన్నులు కూడా చక్కగా కుదిరింది. ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ని యూజ్ చేసుకున్న విధానం కథ మీద క్యూరియాసిటీ ని పెంచింది. ఇక సెకాంఫ్ ఆఫ్ విషయానికి వస్తే కథనంలో వేగం పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ లో మనం చూసిన పాత్రలకి సెకండ్ ఆఫ్ లో చూసే పాత్రలకి కంప్లీట్ వేరియేషన్ వస్తుంది. ఒక మనిషిలో ఎలా అయితే రెండు పార్శ్యాలు ఉంటాయో అలాగే చూపించారు. తన అన్నని ఒక చెల్లెలు ఎలా కాపాడుకుంటుంది అనేది కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ కి చివర్లో ధనుష్ ఇచ్చే ట్విస్ట్ ఎంటైర్ ధనుష్ క్యారెక్టర్ ఇది అని ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రాయన్ పాత్రలో ధనుష్ యాక్టింగ్ ఒక లెవల్లో ఉంది. ఎక్కడ ఓవర్ డోస్ లేకుండా ఎంత వరకు పెర్ఫార్మ్ చెయ్యాలో అంతవరకే చేసాడు. ఇక దర్శకుడు కూడా ఆయనే కాబట్టి టేకింగ్ అండ్ సబ్జట్ ని నడిపించిన విధానం చాలా బాగుంది. సింపుల్ గా చెప్పాలంటే 90 ల నాటి మణిరత్నం ని ఇంకోసారి చూపించాడు. ఇక సందీప్ కిషన్ తన పాత్రకి పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండి. ఇక ధనుష్ చెల్లెలుగా చేసిన దుషరా విజయన్ నటన అయితే ఒక రేంజ్ లో ఉంది. ఎంతలా అంటే సినిమా విజయానికి అదనపు బలం చేకూరింది. ఇక ఎస్ జె సూర్య, వరలక్షి శరత్ కుమార్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు సూపర్ గా చేసారు. ఇక ధనుష్ సొంత అన్నయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ పెర్ ఫార్మెన్స్ కూడా బాగుంది. ఏ ఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత పర్లేదని అనిపించాడు. ఎడిటింగ్ అండ్ ఫోటో గ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఇలాంటి సినిమాలని కనపడవు. కాస్టింగే అతి పెద్ద ఎసెట్.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇక ఫైనల్ గా చెప్పాలంటే రాయన్ పక్కా మాస్ మూవీ అయినా కూడా మహిళా ప్రేక్షకులకి కూడా నచ్చుతుంది. ఎక్కడ బోర్ లేకుండా సాగడం రాయన్ స్పెషాలిటీ.3.
- అరుణాచలం