English | Telugu

సినిమా పేరు:రాత్రి
బ్యానర్:అన్నపూర్ణ సినీ క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
బ్యానర్:అన్నపూర్ణ సినీ క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
శేఖర్ చక్రవర్తి (షాయాజీ షిండే) అనే యాభై యేళ్ళ ధనవంతుడు షర్మిలీ (ప్రీతి మెహ్రా) అనే అమ్మాయిని, తన గురువు అఖండానంద స్వామి (జీవా)వద్దన్నా ఉదయం పెళ్ళి చేసుకుని ఆ రాత్రి గోవాకి హనీమూన్‌కి బయలుదేరతాడు. శేఖర్ గురువు శేఖర్‌ని వెళ్ళొద్దంటాడు. వెళితే శేఖర్ చనిపోతావని హెచ్చరిస్తాడు. కానీ అతను గురువు మాటలు లెక్కచేయకుండా గోవాకి భార్యతో బయలుదేరతాడు. దారిలో అనేక సంఘటనలు జరుగుతూంటాయి. గోవాకి నేషనల్ హైవేలో బయలుదేరిన శేఖర్ చక్రవర్తిని అడవిలో నుండి వెళ్తే గోవాకి మూడు గంటలు ముందుగా చేరుకోవచ్చని, అతని భార్య షర్మిలీ చెప్పటంతో అడవి దారిలోనుండి కారుని పోనిస్తాడు శేఖర్ చక్రవర్తి. దారిలో మంచి నీళ్ళ కోసం షర్మిలీ అడిగితే, ఆ అడవిలో ఒకమ్మాయి కుండతో కనిపిస్తుంది. ఆమె అచ్చం షర్మిలీలా ఉంటుంది. ఓ తెల్లని బొచ్చుకుక్క కారు దారికి అడ్డంగా వస్తుంది. తర్వాత ఆ కుక్క పిల్ల చనిపోయి కారు మీద పడుతుంది. దాన్ని పూడ్చిపెట్టి మరీ బయలుదేరతారు శేఖర్ దంపతులు. ఇలాంటి సంఘటనలకు భయపడ్డ షర్మిలీ అక్కడున్న ఒక ఇంట్లో తలదాచుకుందామంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ షర్మిలీని పోలిన ఫొటో ఉంటుంది. ఉన్నట్టుండి శేఖర్ మీదకు గొడ్డలి వస్తుంది. కొద్దిలో ప్రమాదం తప్పిపోతుంది. ఈ లోగా శేఖర్ చనిపోయి పడుంటాడు. అక్కడికి కృష్ణ (సమీర్) అనే పోలీసాఫీసర్ వస్తాడు. విషయం ఏమిటంటే కృష్ణ, షర్మిలీ ఇద్దరూ ప్రేమికులు. వీళ్ళిద్దరూ కలసి కుట్ర పన్ని శేఖర్‌ని చంపి, అతని ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నుతారు. కానీ శేఖర్ చనిపోయిన తర్వాత మరిన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. అవి అలా ఎలా జరుగుతాయి...? శేఖర్ నిజంగానే చనిపోయాడా...? చివరికి ఏమయింది అనేది మిగిలిన కథ..